Potato Juice for Skin: బంగాళదుంప మన ఇళ్లలో అందుబాటులో ఉండే కూరగాయ. దీంతో మీరు మచ్చలేని ముఖాన్ని పొందవచ్చు. బంగాళదుంపతో కూరలు చేసుకుంటాం. అయితే, దీంతో అనేక సౌందర్య ప్రయోజనాలు ఉంటాయి. దీంతో స్కిన్‌ పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అనేక చర్మ సంబంధిత సమస్యలకు చెక్‌ పెడతాయి. మీ డైలీ స్కిన్‌ కేర్ రొటీన్‌లో బంగాళదుంప రసం యాడ్ చేసుకుంటే సహజసిద్ధమైన గ్లో వస్తుంది. అంతేకాదు దీంతో యాక్నే, పిగ్మంటేషన్‌, నల్ల మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. బంగాళదుంప రసంతో మీరు ఇంట్లోనే గ్లాసీ స్కిన్ పొందుతారు. అది ఎలాగో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ మెరుపు..
బంగాళదుంప రసంతో మీ ముఖంపై గ్లో పెరుగుతుంది. తరచూ బంగాళదుంప రసాన్ని కాటన్‌ తో మీ ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖంపై డార్క్‌ స్పాట్స్, పిగ్మంటేషన్‌, ఈవెన్‌ స్కిన్‌ టోన్‌ లభిస్తుంది. బంగాళదుంప రసంతో మీకు గ్లోయింగ్‌ స్కిన్‌ వస్తుంది.  


యాక్నేకు చెక్‌..
బంగాళదుంప రసం ముఖానికి అప్లై చేయడం వల్ల ఇందులోని అజెలియాక్ యాసిడ్‌ మచ్చలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. మీ ముఖాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. ముఖంపై రంధ్రాలను కూడా పూరిస్తుంది. చర్మంపై ఉన్న డెడ్‌ స్కిన్‌ తొలగిస్తుంది బంగాళదుంప రసం. ముఖ్యంగా ఇది నేచురల్‌ టోనర్‌ మాదిరి పనిచేస్తుంది. ముఖంపై పిగ్మంటేషన్‌ తొలగించి ముఖానికి రెట్టింపు గ్లో వచ్చేలా చేస్తుంది.


ఇదీ చదవండి: ఈ 7 పండ్లను తింటూ ఉంటే చాలు.. మీ జుట్టు మందంగా దృఢంగా పెరుగుతూనే ఉంటుంది..


డార్క్‌ సర్కిల్స్‌..
బంగాళదుంప రసంతో మన కళ్ల చుట్టు ఉండే డార్క్‌ సర్కిల్స్‌ కూడా తగ్గిపోతాయి. దీంతో మీ ముఖానికి ఈవెన్‌ స్కిన్‌ టోన్ లభిస్తుంది.  పచ్చి బంగాళదుంపను స్లైసులుగా కట్‌ చేసి కళ్లపై పెట్టి ఓ 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో కళ్ల వాపు, డార్క్‌ సర్కిల్స్‌ తగ్గిపోతాయి.


నేచురల్ టోనర్..
బంగాళదుంప రసం నేచురల్ టోనర్‌ మాదిరి పనిచేస్తుంది. ముఖ్యంగా దీన్ని తరచూ వాడటం వల్ల మీ ముఖానికి రెట్టింపు గ్లో వస్తుంది. ఇది ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. దీంతో అనేక చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బంగాళదుంప రసం విటమిన్ సీ, బీ, ఫాస్పరస్ ఉంటుంది. ఇది మీ డైలీ స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో ఉంటుంది.


ఇదీ చదవండి: ఈ 5 సూపర్ ఫుడ్స్‌తో ఇంట్లోనే బరువు సులభంగా తగ్గిపోతారు..


దురదలు..
బంగాళదుంప రసం చర్మంపై ఉన్న దురదలు తగ్గిపోతాయి. విటమిన్ సీ, బీ, పొటాషియం, ఫ్లవనాయిడ్స్‌ ఉంటాయి. దురదలు, ఇన్ల్ఫమేషన్‌ సమస్య తగ్గిపోతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి