Potato Side Effects: అతిగా బంగాళాదుంప తింటే.. మంచానికే పరిమితం!
Potato Side Effects: అతిగా బంగాళాదుంపలను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులకు దారీ తీసే ఛాన్స్ ఉంది. కాబట్టి అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.
Potato Side Effects: బంగాళాదుంప అంటే ఇష్టపడని వారుండరు.. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా బంగాళాదుంపతో తయారు చేసిన చిప్స్‌ను అతిగా తింటూ ఉంటారు. నార్త్‌లోని కొంతమంది ప్రతి రోజు బంగాళాదుంపతో రెడీ చేసిన కర్రీస్, ఫ్రైస్ ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల శరీరానికి అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అతిగా బంగాళాదుంప తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు బరువు పెరగడం ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అతిగా తినడం మానుకుంటే చాలా మంచిది. అయితే బంగాళాదుంప అతిగా తినడం వల్ల కలిగే 5 దుష్ప్రభావాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. బరువు పెరగడం:
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా కొంతమందిలో నూనెలో వేయించిన చిప్స్ అతిగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారీ తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, బరువు తగ్గాలనుకునేవారు అతిగా బంగాళా దుంపలను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
2. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:
బంగాళాదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 78 కలిగి ఉంటుంది. కాబట్టి అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. అంతేకాకుండా ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారి తప్పకుండా వీటిని అతిగా తినడం మానుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
3. అధిక రక్తపోటు:
బంగాళాదుంపలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఒక మధ్య తరహా బంగాళాదుంపలో సుమారు 9 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల స్ట్రోక్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్నవారు అతిగా అలూ తినకపోవడం చాలా మంచిది.
4. పోషకాల లోపం:
బంగాళాదుంపలు పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల ఇతర పోషకాలపై దెబ్బపడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొంతమందిలో వీటిని అతిగా తినడం వల్ల శరీరంలోని పోషకాలు పెరిగి ఇతర అనారోగ్య సమస్యలకు దారీ తీసే ఛాన్స్ కూడా ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
5. జీర్ణ సమస్యలు:
కొంతమందిలో బంగాళాదుంపలు అతిగా తినడం వల్ల గ్యాస్ట్రిక్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు కూడా దారీ తీసే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి పొట్ట సమస్యలు ఉన్నవారు అతిగా తినడం మానుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల పొట్టలతో ఇతర సమస్యలకు కూడా దారీ తీయోచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి