White Hair To Black Naturally Permanent: అతి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? అయితే మీ అందరి కోసం అద్భుతమైన హోమ్ రెమెడీస్‌ని పరిచయం చేయబోతున్నాం. వీటితో జుట్టు శాశ్వతంగా నల్లబడడమే కాకుండా చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


White Hair To Black Naturally Permanent: చిన్న వయసులోనే చాలామందిలో జుట్టు తొందరగా నెరిసిపోతోంది. ఇలా అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో ఆధునిక జీవనశైలి కారణంగా వస్తే, మరికొంతమందిలో మాత్రం పోషకాహార లోపం, జన్యుపరమైన సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం కారణంగా కూడా వస్తోందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి జుట్టు సమస్యల కారణంగా ముఖం అందం మొత్తం కోల్పోతుంది. కాబట్టి జుట్టు సమస్యలు ఏవైనా తొందరగా అతి సులభంగా పరిష్కరించుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో వయస్సు పెరిగే కొద్దీ కూడా తెల్ల వెంట్రుకలు రావడం ప్రారంభమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపులతో పాటు హెయిర్ కలర్స్‌ను వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అనేక జుట్టు సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటికి బదులుగా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించాలో ఈ తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.


తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణాలు:
ప్రోటీన్ లోపం
అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు
వయస్సు పెరగడం
పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం
ఒత్తిడి కారణంగా
సరిగ్గా నిద్ర లేకపోవడం
జీన్స్ లోపం


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తెల్ల జుట్టు నుంచి ఉపశమనం కలిగించే అద్భుతమైన హోమ్ రెమెడీస్:
తెల్ల జుట్టు నుంచి ఉపశమనం కలిగించేందుకు కాఫీ పొడితో తయారు చేసిన హోమ్ రెమెడీ కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. అయితే దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఆవాల నూనెను వేసుకొని స్టవ్ పైలో ఫ్లేమ్‌లో కాగనివ్వాలి. అందులోనే రెండు చెంచాల పసుపు ఒకటి స్పూన్ కాఫీ పౌడర్ వేసి నెమ్మదిగా నల్లబడేంతవరకు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా నూనె బాగా ఉడికిన తర్వాత అందులో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలిపి, జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోవడం వల్ల జుట్టు తొందరగా నల్లగా తయారవుతుంది. అంతేకాకుండా శాశ్వతంగా జుట్టు నల్లగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.



మెంతులు, కొబ్బరి నూనె హోమ్ రెమెడీ:
ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకోవడానికి మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఉదయాన్నే వీటిని బాగా గ్రైండర్లో రుబ్బుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోనే తగినంత కొబ్బరినూనె వేసి బాగా మిశ్రమం కలుపుకొని జుట్టుకు అప్లై చేయాలి. ఇలా జుట్టుకు అప్లై చేసిన తర్వాత 30 నుంచి 50 నిమిషాల పాటు జుట్టుకు మిశ్రమాన్ని అలాగే పట్టించి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమిడిని వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వినియోగిస్తే జుట్టు త్వరగా నల్లబడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.



(ఈ సమాచారానికి కేవలం నిపుణులు అందించింది మాత్రమే కాబట్టి ఈ హోం రెమెడీస్ వినియోగించే క్రమంలో తప్పకుండా ఆయుర్వేద నిపుణులను లేదా వైద్య నిపుణులను అడిగి తెలుసుకుని వినియోగించడం ఎంతో మంచిది. అలాగే ఈ స్టోరీ కి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు)


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి