Proper Sleep: 7 గంటలకంటే తక్కువ తక్కువ నిద్రపోవడం యమ డేంజర్?
Proper Sleep: సరైన నిద్ర లేకపోవడం కారణంగా చాలామంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొంతమందిలోనైతే ఏడు గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడం కారణంగా మధుమేహం, శరీర బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి సరైన మోతాదులో ప్రతిరోజు నిద్రపోవడం చాలా మంచిది.
Proper Sleep: రోజు సరైన అంత నిద్ర కూడా శరీరానికి ఎంతగానో మేం చేస్తుంది అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా ప్రస్తుతం చాలామంది ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారు ఇలా ప్రతిరోజు నిద్రపోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. సరిగా నిద్ర లేకపోవడం కారణంగా భవిష్యత్తులో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిద్ర లేకపోవడం కారణంగా కూడా అనేక రకాల మానసిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా నిద్ర లేకపోవడం కారణంగా వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఐదు నుంచి ఆరు గంటల పాటు నిద్రపోవడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందిలో నిద్ర లేకపోవడం కారణంగా రోగనిరోధక శక్తి కూడా సులభంగా తగ్గిపోతుంది. దీనికి కారణంగా శరీరం యాక్టివ్ నెస్ కూడా తగ్గుతూ వస్తోందని ఇటీవలే కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీంతోపాటు కొంతమందిలో గుండె సమస్యలు కూడా వస్తున్నాయట. 9 గంటలకంటే తక్కువ నిద్రపోయే వారిలో సులభంగా హార్ట్ ఎటాక్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని ఇటీవలే యూరప్ అధ్యయనాలు తెలిపాయి.
క్యాన్సర్ ప్రమాదం:
ముఖ్యంగా స్త్రీలలో తొమ్మిది గంటలకు తక్కువగా నిద్రపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు కొంతమందిలో కొలొరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మహిళలు 9 గంటలకు పైగా నిద్రపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక పరిస్థితి దెబ్బతినే అవకాశాలు..
సరైన నిద్ర లేకపోవడం కారణంగా ఆలోచన సామర్థ్యం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో రాత్రి నిద్ర లేకపోవడం కారణంగా జ్ఞాపకశక్తి తగ్గి మెదడు కూడా దెబ్బ తినే ఛాన్స్ ఉందట. ముఖ్యంగా కొంతమందిలోనైతే ప్రతికూల ఆలోచనలకు కూడా దారి తీయవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బరువు:
నిద్ర లేకపోవడం కారణంగా సులభంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా తొమ్మిది గంటలకు పైగా నిద్రపోవడం చాలా మంచిది. అయితే ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది మహిళలు ఎక్కువగా నిద్రపోవడం లేదు దీనికి కారణంగా సులభంగా బరువు పెరిగి ఇతరు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారని ఇటీవల అధ్యయనాల్లో తేలింది..
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మధుమేహం రావచ్చు..
నిద్ర అనేది రక్తంలోని చక్కర పరిమాణాలను కూడా ప్రభావితం చేస్తుంది ప్రతిరోజు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోతేనే రక్తంలోని చక్కెర పరిమాణాలు సమానంగా ఉంటాయి. అంతేకాకుండా ఇన్సులిన్ ప్రక్రియ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది ప్రస్తుతం ఐదు నుంచి నాలుగు గంటల పాటు మాత్రమే నిద్రపోతున్నారు. దీని కారణంగా మధుమేహం బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి