Protein food: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి.. ఆహారం, పానీయాల తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవన శైలిలో మార్పులు కూడా తప్పకుండా చేసుకోవాలి. అప్పుడే మీరు అనారోగ్య సమస్యల నుంచి ఉపశనమం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపులున్నారు. ముఖ్యంగా 30 నుంచి 35 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు వీధుల్లో తీసుకునే చెడు ఆహారాపు అలవాట్లవల్లేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటి వల్లే  చర్మంపై ముడతలు, ఫైన్ లైన్ పిగ్మెంటేషన్, ఎముకల్లో సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ప్రోటిన్లు ఉన్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోటీన్ ఆహారాలు ఇవే:
>> శరీరంలోని ప్రోటీన్ ఆహారాల లోపం నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పాలు, మజ్జిగ, పప్పులు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పిండి వంటివి తీసుకోవచ్చు.


>>ప్రోటిన్లను పొందడానికి తప్పకుండా పప్పులు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా  5 నుంచి 6 గ్రాముల ప్రొటీన్ గల పప్పులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం బఠానీలు, బచ్చలికూర, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, ఆస్పరాగస్, పచ్చి శెనగ వాటిని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.


>>అంతేకాకుండా ఆహారంలో పెరుగును కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రోటిన్‌ లోపం ఉన్నవారు క్రమం తప్పకుండా రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగండి. దీంతో పాటు పెరుగును కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


>>వాల్‌నట్‌లు, బాదం పప్పులు, పిస్తాపప్పులు కూడా శరీరంలోని కావాల్సిన ప్రొటీన్లు అతిగా ఉంటాయి. అంతేకాకుండా ఆహారంలో భాగంగా సలాడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


>>ప్రోటిన్లు పొందడానికి ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.  ప్రొటీన్లు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ శక్తిని పెంపొందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok