Pumpkin Juice Health Benefits: కొంతమందికి గుమ్మడికాయ రుచి నచ్చకపోయిన తింటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం లభిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే గుమ్మడి కాయే కాకుండా దాని రసం కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తాయని ఆరోగ్య నిపుపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ గుమ్మడి కాయం రసం తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుమ్మడికాయ రసం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:
1. శీతాకాలంలో చాలా మందిలో జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా గుమ్మడికాయ రసాన్ని తాగడం వల్ల శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభించి శరీరంలోని జీర్ణవ్యవస్థ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


2. స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ గుమ్మడి రసం ప్రభావవంతంగా పని చేస్తుంది. గుమ్మడికాయ రసంలో కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, ఇ, సి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని చలి కాలంలో క్రమం తప్పకుండా తాగడం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.


3. గుమ్మడికాయ రసంలో ఉండే విటమిన్ ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మేలు చేస్తుంది. అంతేకాకుండా గుమ్మడి కాయను రసంలా చేసుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. మధుమేహంతో బాధపడుతున్నవారికి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు  


Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook