ముసాహర్.. బిహార్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రలన్నింటిలో కలిపి ఈ తెగ జనాభా దాదాపు 2.5 మిలియన్లపై మాటే. అనేక సంవత్సరాలుగా నిరాక్షరాస్యత వల్ల, కేవలం వ్యవసాయ కూలీలుగా మాత్రమే పనిచేయగలిగిన వీరు కడు బీదరికాన్ని జయించడానికి... ఆకలిపోరును ఆపడానికి ఎలుకలపై ఆధారపడ్డారట. ఎలుకలను పట్టి, వాటిని చంపి వండుకొని తినడం వీరికి తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముసాహర్ సంప్రదాయం వారి వారసత్వానికి కూడా వచ్చింది. సంచార జాతులుగా జీవించే వీరు సాధ్యమైనంత వరకు తమకు దొరికే ఏ కూలిపనో చేసుకుంటారు. దినసరి వేతగాళ్లుగా జీవిస్తారు. ఇక  చేయడానికి ఏ పని కూడా దొరకని రోజున.. ఉన్న కొద్ది బియ్యాన్ని వండుకొని.. ఎలుకలను బాగా కాల్చి నంచుకొని తింటామని చెబుతున్నారు. 


అయితే ఎలుకలను చంపి తినడం వల్ల వీరికి ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా వీరు ఈ అలవాటు మానలేకపోతున్నారు. సంచార జాతులు కావడం వలన వీరు ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. కనీసం రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు అంటే కూడా తమకు ఏంటో తెలియదని.. కేవలం ఊర్లు తిరిగి.. దొరికిన పనిచేసుకొనే జీవితాలు తమవని ఎంతో ఆర్ద్రతతో చెబుతుంటారు ఈ ముసాహర్ తెగవాళ్లు.