మద్యం సేవించడం ఆరోగ్యానికి ( Alcohol is injurious to health ) హానికరం. అయినా మద్యం అమ్మకాలు కొనసాగుతూనే ఉంటాయి. మద్యం సేవించడంలో ఆ రాష్ట్రం మహిళలు అందరికంటే టాప్ లో ఉన్నారంట. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ( Central health family welfare department ) నిర్వహించిన సర్వే ఫలితాలివి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన వార్షిక సర్వేలో వెల్లడైన విషయాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. మద్యం సేవించే మహిళల్లో ( Women consumers of Alcohol ) ఈశాన్యరాష్ట్రమే ముందంజలో ఉండటం విశేషం. 2019-20 సర్వే గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే..అస్సోం రాష్ట్ర మహిళలు  ( Assam women top in alcohol consumers ) అత్యధికంగా మద్యం సేవిస్తున్నట్టు తేలింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న అసోం మహిళల్లో 26.3 శాతం మంది మద్యం సేవిస్తుండగా.. మేఘాలయలో ఇది 8.7 శాతంగా ఉంది. ఇదే వయసు మహిళలు దేశవ్యాప్తంగా అయితే కేవలం 1.2 శాతం మాత్రమే


2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ( Survey 4 )నివేదికలో ఈ గణాంకాలను పొందుపరిచారు. అయితే 2018-19లో నిర్వహించిన సర్వే 5 నివేదిక ఇంకా విడుదల కావల్సిఉంది. మరోవైపు 2005-06లో నిర్వహించిన సర్వే 3 సర్వే నివేదిక ప్రకారం 15-49 ఏండ్ల వయసున్న అసోం మహిళల్లో మద్యం సేవించేవారి శాతం 7.5గా ఉన్నది.


అంటే ఈ సర్వేలో అస్సోం కంటే మిగిలిన రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్‌-33.6 శాతం, సిక్కిం-19.1 శాతం, ఛత్తీస్‌గఢ్‌-11.4 శాతం, జార్ఖండ్‌-9.9 శాతం, త్రిపుర-9.6 శాతంతో  ముందంజలో ఉన్నాయి.  అంటే  సర్వే 3లో 7.5 శాతంగా ఉన్న మహిళల మద్యం సేవనం ( liquor consuming women ).. సర్వే 4లో 26.3 శాతానికి గణనీయంగా పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదే సందర్భంలో సర్వే 3లో టాప్ లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌-3.3 శాతం, సిక్కిం -0.3 శాతం, ఛత్తీస్‌గఢ్‌-0.2 శాతం, జార్ఖండ్‌-0.3 శాతం, త్రిపుర-0.8 శాతంకు గణనీయంగా తగ్గింది.


అటు వారానికి ఒకసారి మద్యంసేవించే మహిళలు దేశవ్యాప్తంగా 35 శాతముంటే..అస్సోంలో 44.8 శాతంగా ఉంది. టొబాకో వినియోగంలో కూడా అస్సోం మహిళలే టాప్ లో ఉన్నారు. గతంతో పోలిస్తే.. అస్సోం మహిళల్లో మద్యం సేవనం ఎందుకు పెరిగిందనేదానిపై స్పష్టమైన వివరణ ఇంకా తెలియలేదు. కేవలం ఒక్క సర్వే అంతరంలో అంత పెరుగుదల ఎలా సాధ్యమైంది...ప్రత్యేకమైన కారణమేమైనా ఉందా అనే విషయంపై పరిశీలన జరుగుతోందిప్పుడు. Also read: Guinness world record: ఉంగరం ఒక్కటే..డైమండ్స్ మాత్రం 7 వేల 8 వందలు