Hair Dandruff Solution At Home: చుండ్రు వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చుండ్రు వదలించుకోవడానికి చాలా మంది అనేక ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల జుట్టు మరింత ఊడిపోతుంది. సమస్య మరి ఎక్కువగా అవుతుంది.  అయితే చుండ్రు అనేది ఎందుకు వస్తుంది? ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చుండ్రు సమస్య  అనేది ఈస్ట్‌కు సంబంధించిన ఫంగస్ అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ చుండ్రును మెడికల్‌ పరంగా మలాసెజియా అని పిలుస్తారు.  అయితే ఇది ఎలా వస్తుంది అంటే.. ఎక్కువ కెమికల్ షాంపూలు ఉపయోగించడం వల్ల ఫంగల్‌గా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. చుండ్రు అనేది కేవలం ఫంగస్‌ వల్లనే కాకుండా శరీరంలో విటమిన్లు లోపించినప్పుడు కూడా ఈ సమస్య బారిన పడుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Sitting Posture: స‌రైన పొజిషన్ లో కూర్చోకపోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే!


శరీరంలో ఎలాంటి విటమిన్లు లోపించినప్పుడు చుండ్రు వస్తుంది: 



విటమిన్ బి6, విటమిన్ బి3, విటమిన్ బి2లోపించడం వల్ల చుండ్రు వస్తుంది. ఈ విటమిన్లు లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా జుట్టును సహజ గుణాలు కలిగిన షాంపూలతో తలస్నానం చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. చుండ్రుకు ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టుకు పట్టించి అరగంట పాటు ఉంచి తర్వాత నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ రంసం జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు తొలగిపోతుంది.


Also read: Skincare Drinks: అందం పెంచడంలో ఈ జ్యూస్‌లను తప్పక తీసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter