కావలసిన పదార్థాలు:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చికెన్ - 500 గ్రాములు 
వంకాయ - 200 గ్రాములు (ముక్కలుగా తరుగుకోవాలి)
పెద్ద సైజు ఉల్లిపాయ - 1 ( ముక్కలుగా తరుగుకోవాలి) 
టమాటా - 1 ( ముక్కలుగా తరుగుకోవాలి)
కరివేపాకు -  1 రెమ్మ 
ఉప్పు - తగినంత 
నూనె - 4 టేబుల్ స్పూన్లు 
చికెన్ మసాలా పొడి - 3 టేబుల్ స్పూన్లు


తయారీ పద్ధతి:-


1. మొదట ఒక గిన్నె తీసుకొని చికెన్ ముక్కల్ని బాగా కడుక్కోవాలి. ఆతరువాత చికెన్ మసాలా పొడి కలుపుకొని పదిహేను నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. 


2.  పొయ్యి మీద బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. తరుగుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. 


3. పక్కన పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి  తగినంత ఉప్పు వేసి కలిపి 5-7 నిమిషాల పాటు మంట మీద పెట్టాలి. 


4. తరుగుకున్న వంకాయ ముక్కల్ని చికెన్ తో పాటు కలపాలి. 4-5 నిమిషాల పాటు మూతపెట్టి మంటమీద ఉంచాలి. 


5. టమాట ముక్కల్ని, కరివేపాకు, కాసింత నీరు పోసి మూతపెట్టాలి. 


6.  స్టఫ్ గ్రేవీ మాదిరి వచ్చే వరకు మంటమీద ఉంచండి. అంతే వేడివేడి వంకాయ చికెన్ రెడీ!