Red Wine For Diabetics: చాలా మంది వివాహ వేడుకల్లో, ఇతర కార్యక్రమాల్లో ఒక గ్లాసు నుంచి రెండు గ్లాసుల రెడ్ వైన్‌ తీసుకుంటూ ఉంటారు. అయితే దీనిని తీసుకుంటే శరీరానికి విశ్రాంతి లభించడమేకాకుండా అనేక రకాల పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది రెడ్ వైన్ హానికరమని భావిస్తారు. కానీ దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలగుతాయి. ఒక గ్లాసు రెడ్ వైన్ క్యాన్సర్, డ్రిప్, గుండె సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రెడ్ వైన్‌లో విటమిన్ సి, విటమిన్ బి-6, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తాగితే రోగరనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపించేలా చేస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ రెడ్ వైన్‌  తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది:
టైప్-2 డయాబెటిస్‌:

చాలా మంది మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి రెడ్ వైన్‌ను క్రమం తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గిస్తాయి.


క్యాన్సర్‌ను నివారిస్తుంది:
రెడ్ వైన్‌లో రెస్‌వెరాట్రాల్, కాటెచిన్స్, ఎపికాటెచిన్, ప్రోయాంతోసైనిడిన్స్ వంటి యాంటీ-ఆక్సిడెంట్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరంలోని ఆక్సీకరణం నష్టాన్ని తగ్గించి గుండె జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుంగా క్యాన్సర్‌ను నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. వైన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి హృదయనాళ ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.


ఒత్తిడి, డిప్రెషన్‌:
రెడ్ వైన్ మహిళల్లో డిప్రెషన్ ప్రమాదాన్ని సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వైన్ తీసుకోవడం బాడీ కూడా రిలాక్స్‌ గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు రోజుకు 5 నుంచి 15 మి.లీ వైన్ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌:
రెడ్ వైన్ క్రమం తప్పకుండా తాగితే.. రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె సమస్యలు సులభంగా తగ్గుతాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు కచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..   


Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook