Reduce Bad Cholesterol: రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగడం వల్ల గుండెకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా గుండెకు రక్త సరఫర కూడా ఆగిపోతుంది. ఇలాంటప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మరికొందరు కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల కూడా మరణిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ  ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది:  
1. పచ్చి అల్లం:

ప్రతి రోజూ పచ్చి అల్లాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చాలా మంది ప్రస్తుతం వేయించిన స్పైసీ ఫుడ్స్‌ తీసుకుంటున్నారు. అయితే వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా మందిలో కొలెస్ట్రాల్‌ సమస్యలు వస్తున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ప్రతి రోజు పచ్చి అల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.


2. అల్లం నీరు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్‌ పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అల్లంతో తయారు చేసిన ఔషధాలు కలిగిన నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.


3. లెమన్ టీ:
రెగ్యులర్‌గా అల్లం టీ, లెమన్ టీని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించి శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ టీని తాగాల్సి ఉంటుంది.


4. శొంఠి పొడి:
ప్రతి రోజూ శొంఠి పొడి వినియోగిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా సీజనల్‌లో వచ్చే చాలా రకాల వ్యాధులకు కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఈ పొటిని వినియోగించాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం


Also read: PF Transfer: ఈపీఎఫ్ఓ అప్‌డేట్, పాత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త కంపెనీకు ఎలా మార్చడం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook