How To Reduce Bad Cholesterol In 7 Days: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తాయి. సిరల్లో ఫలకం పేరుకుపోవడం గుండె సమస్యలు వస్తాయి. దీని కారణంగా చాలా మందిలో ప్రాణాంతకంగాను మారుతోంది. అయితే ఇలాంటి క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీని కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లలో కూడా పలు రకాల మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆహార పదార్థాల వల్లే కొలెస్ట్రాల్ విచ్చల విడిగా పెరుగుతుంది:


1. తీపి పదార్థాలు:
ఆధుని జీవన శైలి కారణంగా చాలా మంది విపరీతంగా తీపి పదార్థాలు తింటున్నారు. అయితే దీని వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  అంతేకాకుండా దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ మొత్తం సిరల్లో పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ఆహారంగా క్యాండీలు, కుకీలు, కేకులు, ఫ్రూట్ షేక్స్, స్వీట్లను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.


2. ఆయిల్ ఫుడ్స్:
భారతీయులు ఎక్కువగా నూనె,  డీప్ ఫ్రైడ్ ఫుడ్స్‌తో చేసిన ఆహారాలను అతిగా తింటూ ఉంటారు. అయితే ఇలా వాటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పెరుకుపోతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకంగాను మారుతోంది. కాబట్టి ఇలాంటి ఆహారాలను తినకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.


3. ప్రాసెస్డ్ ఫుడ్:
టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ చేసిన ఫుడ్‌కు అలవాటు పడ్డారు. అయితే దీని కారణంగా కూడా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్, సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల సులభంగా గుండె జబ్బులకు దారి తీసే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


4. రెడ్ మీట్:
రెడ్ మీట్‌లో శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. అయితే దీనిని అతిగా తినడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రెడ్‌ మీట్‌ను విచ్చల విడిగా తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలలో బాధపడేవారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: మూడు పెళ్లిళ్లు-మూడు పేర్లు, రెండో భర్తతో అలా ఉందని భార్యను దారుణంగా చంపిన మూడో భర్త


Also Read: Bandla Ganesh Tounge Slip: ధమాకా సక్సెస్ మీట్లో ‘బూతు’ జారిన బండ్ల.. ఇప్పుడేమో ఇలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook