Raisins Benefits: పోషక పదార్ధాలు పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్‌లో ఎండుద్రాక్ష కీలకమైంది. రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా ఎండుద్రాక్ష తీసుకుంటే ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో కీలకమైంది చెప్పుకునేది ఎండుద్రాక్ష. ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, పొటాషియం తగిన స్థాయిలో ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అందుకే ఎండుద్రాక్ష రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనముంటుంది. రాత్రి పూట తింటే..ఇంకా మంచి ఫలితాలుంటాయి. ఎండుద్రాక్షతో కలిగే లాభాలేంటో చూద్దాం..


ఎండుద్రాక్ష రాత్రి పూట ఎందుకు తినాలి


రాత్రి వేళ నిద్రపోయేముందు ఎండుద్రాక్ష తినడం వల్ల ముఖ్యంగా పురుషులకు చాలా ఉపయోగం. రోజూ రాత్రి ఎండుద్రాక్ష తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. ముఖ్యంగా పురుషుల శారీరక బలహీనత తగ్గుతుంది. ఎందుకంటే ఇంందులో ఉండే ఎమైనో యాసిడ్స్ లింగ సమస్యను దూరం చేస్తుంది. అందుకే శారీరకమైన సమస్యలకు రోజూ రాత్రి పూట తింటే మంచి ప్రయోజనముంటుంది. 


చర్మ సంరక్షణకు


రోజూ రాత్రివేళ ఎండుద్రాక్ష తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ఎందుకంటే ఇందులో పుష్కలంగా లభించే పోషక పదార్ధాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రివేళ తినడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే ప్రోటీన్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉండాయి. అందుకే రాత్రి వేళ తినడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 


బరువు తగ్గడంలో


ఎండుద్రాక్షలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే జీర్ణ సమస్యలు ఉండవో శరీర మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితందా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. 


Also read: Cholesterol Control Tips: చర్మంపై ఇలాంటి సమప్యలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి.. ఇవి చెడు కొలెస్ట్రాల్‌కు సంకేతాలు.!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook