Relationship Tips: పెళ్లి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన, అనిర్వచనీయమైన ఘట్టం. వివాహమైన తరువాత ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు కచ్చితం. అసలు పెళ్లైన తరువాత ఏయే మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఒక్కరి జీవితంలో లేదా ప్రతి జంట జీవితంలో కీలకమైన మార్పు అనేది పెళ్లి తరువాత ప్రారంభమౌతుంది. వివాహం తరువాత అందరి జీవితాల్లో మార్పులు వస్తుంటాయి. కొన్ని మార్పులు ప్రశాంతతను చేకూరిస్తే..మరికొన్ని మార్పులు విషాదాన్ని తెస్తాయి. ఈ రెండింట్లో ఏదో ఒక మార్పును ప్రతి పెళ్లైన జంట చవిచూడాల్సిందే. జీవితంలో వచ్చే మార్పును చవిచూసిన తరువాత వైవాహిక జీవితం సక్సెస్ అయినట్టే. ఆసలు పెళ్లైన తరువాత జీవితాల్లో వచ్చే మార్పులేవనేది ఇప్పుడు పరిశీలిద్దాం..


పెళ్లికి ముందు అత్యంత ఆకర్షణీయంగా అన్పించేవాళ్లు..పెళ్లైన తరువాత వ్యతిరేకత కన్పించవచ్చు. అంటే జీవితం అనేది అనుకున్నంత సులభంగా, సాఫీగా ఉండదు. ఎన్నెన్నో ఒడిదుడుకులు సహజం. అందుకే జీవిత భాగస్వామిలో ఉన్న మంచి లక్షణాల్నే కాకుండా..లోపాల్ని కూడా స్వీకరించగలగాలి, అర్ధం చేసుకోగలగాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలమని అర్ధం చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇస్తుండాలి. జంటలో ఇద్దరూ ఒకరికొకరు ధ్యాంక్ యూ, ప్లీజ్ వంటి పదాల వినియోగం ఎక్కువగా చేస్తుంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెళ్ళికి ముందు  స్వీయ పొగడ్తలు నచ్చినా..పెళ్లైన తరువాత భాగస్వామిని ప్రశంసించడం అలవాటు చేసుకోవాలి.


పెళ్లైన తరువాత ముఖ్యంగా వచ్చే మార్పు బాధ్యతలు రావడం. ఆ బాధ్యతల్ని నెరవేర్చేందుకు ముందు మీ అలవాట్లు, పద్ధతుల్లో సహజంగానే మార్పు వచ్చేస్తుంది. ఆ తరువాత కాలానుగుణంగా బాధ్యత కలిగిన వ్యక్తిగా మారుతారు. బాథ్యతల్ని మోయడం నేర్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లైన తరువాత ఎక్కువమందికి తమ ప్రాధాన్యతల్లో మార్పు కన్పిస్తుంది. పెళ్లికి ముందు ఆఫీసు లేదా స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే..పెళ్లైన తరువాత జీవిత భాగస్వామి తొలి ప్రాధాన్యత అవుతుంది. ఇలాంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు అర్ధం చేసుకుంటూ..తమను తాము మార్చుకుంటూ ముందుకు సాగితే పెళ్లి జీవితం కచ్చితంగా విజయవంతమైనట్టే.


Also read: Weight loss tips: ఏ వయస్సులోనైనా స్థూలకాయం తగ్గించే అద్భుత మార్గాలు ఇవే



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.