Tips To Keep Nails Clean: ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు పొడవాటి గోర్లు పెంచుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఈ పొడవాటి గోర్ల కోసం బ్యూటీ పార్లర్‌లో ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ గోళ్లపైన కొందమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన తర్వాత షాకింగ్‌ విషయాని కనిపెట్టారు. సాధారణంగా మనిషి గోర్లు 32 కంటే ఎక్కువ బ్యాక్టీరియా, 28 కంటే ఎక్కువ ఫంగస్ మన గోర్లు లో ఉంటాయని వారు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాని కనిబెట్టారు. వారి పరిశోధనలో పొడవాటి గోళ్లలో స్టాఫ్ ఆరియస్ అనే బ్యాక్టీరియా కనుగొనబడిందని అంటున్నారు. దీని వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాని చెబుతున్నారు.ఈ బ్యాక్టీరియా కేవలం గోరు కింద ఉంటుంది. 


గోళ్ల కింద ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ సాధారణంగా హానిచేయనివని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో సూక్ష్మజీవులు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో, గాయం ఆయిన వారిలో  తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఈ బ్యాక్టీరియా వల్ల  గోర్లు రంగు మారడం, చీము కారడం వంటి లక్షణాలు కనబడుతాయి.


అయితే ఈ సమస్యను నుంచి బయటపడాలి అంటే గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే  ఇక్కడ చెప్పిన విధంగా మీ గోళ్లను శుభ్రం చేసుకుంటే ఎలాంటి హాని కరమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం  



మీ  గోళ్లను సబ్బు, నీటితో రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా మీ చేతులో చేరకుండా ఉంటుంది. 


గోళ్లలో మురికి ఉంటే దీని కోసం మీరు ఏదైన సాఫ్ట్‌ బ్రష్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మీ గోళ్ల చర్మంపై ఎలాంటి హాని కలిగించదు.


పొడవాటి గోర్లును పెంచుకోవడం మంచిదికాదు. దీని వల్ల క్రిములు సులభంగా పేరుకుపోతాయి.


వారం వారం గోళ్లను కత్తిరించడం వల్ల హానికరమైన బ్రక్టీరియా మీ చేతులో చేరకుండా ఉంటుంది.


 అమ్మాయిలు నెయిల్ పెయింట్ వేయడానికి ముందు గోళ్లను శుభ్రం చేసుకోండి.
 


Also read: Budget Facts: దేశంలో బడ్జెట్ గురించి ఆసక్తికరమైన అంశాలు, తొలి బడ్జెట్ ఆదాయం అంచనా ఎంతో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook