Rid Of White Hair Naturally: మనం అద్దం ముందు ఉన్నప్పుడల్లా, కళ్ళు తరచుగా జుట్టు వైపు వెళ్తాయి. జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో చిన్న వయస్సులోనే జుట్టు బలహీనంగా, తెల్లగా మారడం, జుట్టు రాలి పోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ఈ సమస్యను రోజూ మనం తినే కూరగాల ద్వారా ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోరకాయ సహాయంతో జుట్టు నల్ల బడుతుంది:


25 నుంచి 30 సంవత్సరాల వయసులో జుట్టు తెల్లగా మారడం వంటి సమస్యలు ఉంటే.. వెంట్రుకలకు మార్కెట్‌ లభించే ఉత్పత్తులతో రంగులను అస్సలు వేయోద్దు. ఇవి జుట్టుకు రంగును ఇవ్వడమేకాకుండా నిర్జీవంగా మార్చగలవు. కావున ఈ వయసులో ఉన్న వారు సహజ సిద్ధంగా జుట్టును నల్లగా మార్చుకోవడం ఉత్తమం. అయితే తలపై నల్ల వెంట్రుకల కోసం గోరింటాకు ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


సోరకాయ రసం:


సోరకాయలో విటమిన్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీని రసం తాగితే శరీరం డిటాక్సిఫై అవుతుంది. దీని ప్రభావం చర్మం, జుట్టు మీద కూడా పడుతుంది. వారంలో 3 రోజులు సీసా సొరకాయ రసం తాగితే క్రమంగా తెల్లజుట్టు అంతా నల్లగా సహజంగా మారుతుంది.


సోరకాయ తొక్కలు:


చాలా సార్లు మనం సోరకాయ తొక్కలను వండేటప్పుడు వేరు చేస్తాము. దాని వల్ల వాటి నుంచి వచ్చే ప్రయోజనాలు కోల్పోతారు. ఈ తొక్కలను మెత్తగా రుబ్బుకుని రసాన్ని తీయండి. ఇప్పుడు ఈ జ్యూస్ సహాయంతో స్కాల్ప్‌కు మసాజ్ చేసి.. ఆరిపోయే వరకు వేచి ఉండండి. చివరగా జుట్టును శుభ్రం చేయండి.


సోరకాయ నూనె:


జుట్టు నల్లగా మారాలంటే సోరకాయతో నూనెను సిద్ధం చేసుకోండి. దీన్ని తయారు చేసేందుకు కొబ్బరి నూనె అవసరం. దీని కోసం ముందుగా సోరకాయ తొక్కను కోసి కొన్ని రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక పాత్రలో కొబ్బరి నూనె వేసి వేడిచేసిన తర్వాత ఎండు సోరకాయ తొక్కలు వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో భద్రపరుచుకుని రోజూ రాత్రి తలకు మసాజ్ చేయాలి. ఇప్పుడు ఉదయాన్నే లేచి జుట్టును శుభ్రం చేసుకోండి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా


Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook