Right Sheet Mask: మీ ముఖానికి సరిపోయే షీట్ మాస్కులు ఎలా ఎన్నుకోవాలో తెలుసా?
Right Sheet Mask:ఈ మధ్యకాలంలో షీట్ మాస్కుల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ముఖానికి సరిపడా షీట్ మాస్కులు రకరకాలుగా ఫ్లేవర్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ ముఖానికి మంచి పోషకాలను అందిస్తాయి.
Right Sheet Mask:ఈ మధ్యకాలంలో షీట్ మాస్కుల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ముఖానికి సరిపడా షీట్ మాస్కులు రకరకాలుగా ఫ్లేవర్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ ముఖానికి మంచి పోషకాలను అందిస్తాయి. మీ ముఖానికి సరిపోయే షీట్ మాస్క్ ఎలా ఎన్నుకోవాలో తెలుసుకుందాం.
షీట్ మాస్క్ ను డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లకి వివిధ రకాలుగా అందుబాటులో ఉంటాయి. మన స్కిన్ రకాన్ని బట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో మీ చర్మం రంగు మెరుగు పడుతుంది. దురద అలర్జీ సమస్యలు కూడా రావు
నార్మల్, డ్రై స్కిన్..
ఈ రకం స్కిన్ ఉన్నవాళ్లకి హైలోరోనిక్ , యాసిడ్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉన్న పదార్థాలలో షిట్మాస్కులు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ గుణాలు ఉంటాయి. డ్రై స్కిన్ వాళ్లకి మాయిశ్చర్ ఉండే షీట్ మాస్క్ , స్నెయిల్ మ్యూసిన్ ,రైస్ మాస్కులు కూడా సరిపోతాయి.
ఇదీ చదవండి: పనసగింజలను గుప్పెడు ఉడికించి తింటే 100 ఆరోగ్య ప్రయోజనాలు..
ఆయిలీ స్కిన్..
ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకి ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్ ,హైడ్రాక్సి యాసిడ్స్ మండలిక్ ఆసిడ్ మాస్కులు బాగుంటాయి. షీట్ మాస్క్ ముఖంపై యాక్నే రాకుండా కాపాడతాయి.
సెన్సిటివ్ స్కిన్..
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు అలోవెరా, అలోటిన్ ఎక్ట్సాక్ ఉన్న షీట్ మాస్కులు ఉపయోగించాలి .సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళకి ఇది కూలింగ్ మాస్కుల పనిచేస్తుంది. వీటిని ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టి ఉపయోగించాలి. యాంటీ ఏజింగ్, ప్యూరిఫైయింగ్ అని లేబుల్ ఉన్న షీట్ మస్కుల జోలికి వెళ్ళకూడదు. ఇవి చర్మంపై దురద, అలర్జీని తీసుకువస్తాయి. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ స్కిన్ రిజ్వనేటింగ్ ఇంగ్రిడియంట్స్ కూడా వాడకూడదు. ఆల్ఫా బెటా హైడ్రాక్సియాసిడ్, రెటీనాల్, విటమిన్ సి యాంటీ ఆక్సిట్స్ కారమైడ్స్ ఉండే ఉపయోగించవచ్చు.
ఇదీ చదవండి: లీచి పండుతో బరువు త్వరగా తగ్గొచ్చు అని మీకు తెలుసా?
కొన్ని షీట్ మా స్కూల్లో సిరం కూడా ఉంటుంది రాత్రి సమయంలో వీటిని ఉపయోగించండి వీటిని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి మరుసటి రోజు ఉపయోగించాలి. ముఖ్యంగా షిట్ మా స్కూల్ ఎంచుకునే సమయంలో తక్కువ పదార్థాలు ఉన్నవి తీసుకోవాలి దీంతో చర్మంపై దురదలు ఎలర్జీ సమస్యలు రాకుండా ఉంటాయి.షీట్ మాస్క్ వేసుకోవటం వల్ల మన ముఖానికి రిలాక్సేషన్ కూడా వస్తుంది మంచి పోషకాలు అందుతాయి పునరుజ్జీవనం వచ్చి, ముఖం కాంతివంతంగా మారుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి