Right Way To Drink Milk: చాలామంది ప్రజల్లో కొన్ని అపోహాలకు జవాబులే దొరకడం లేదు. ముఖ్యంగా కొంతమంది అయితే పురాతన కాలం నుంచి వస్తున్న అపనమ్మకాలు నమ్మకాలను పాటిస్తునే వస్తూ ఉన్నారు. అయితే పూర్వీకుల నుంచి వస్తున్నది ఏంటంటే కూర్చున్నప్పుడు నీరు తాగడం.. నిలబడి పాలు తగడం మాత్రమే శరీరానికి మంచిదని లేదంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలాసార్లు వీలుంటారు. అయితే దీని వెనుక శాస్త్రీయ తర్కం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. కూర్చొని పాలు తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ తర్కం ఏమిటో మనం ఇప్పుడే తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూర్చొని నీళ్లు ఎందుకు తాగాలి?:
కూర్చుని నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీని కారణంగా జీర్ణ క్రియ కు సంబంధించిన సమస్యలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా కిడ్నీలో పనితీరులో కూడా మార్పులు సంభవించి కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి చాలామంది కూర్చుని మాత్రమే నీటిని తాగుతూ ఉంటారు.


నిలబడి నీటిని తాగడం వల్ల నష్టాలు కలుగుతాయా..?:
నిలబడి నీటిని తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎముకల్లోనూ కాల్షియం తగ్గి అల్సర్ ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కడుపులో ఆమ్లం ఏర్పడి పొట్ట సమస్యలకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


పాలు ఎలా తాగాలో తెలుసా..?:
నిలుచుని పాలు తాగడం వెనుక లాజిక్ ఏమిటంటే పాలలో పోషకాలు సరిగ్గా శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా సులభంగా తగ్గిపోతాయి. కాబట్టి పాలను ఎప్పుడు నిలబడి తాగడమే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!


Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook