Roasted Gram For Weight Loss In 8 Days: చాలామంది వేయించిన శనగపప్పును చిరుదిండ్లుగా తీసుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయని.. అంతేకాకుండా ఇందులో రొటీన్లు కాలుష్యం విటమిన్లు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేయడమే కాకుండా బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే వేయించిన శనగపప్పు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఆ ప్రయోజనాలెంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేయించిన శనగలు తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఇవే..
రోగ నిరోధకశక్తి  పెరుగుతుంది:

వేయించిన శనగపప్పు ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులను శరీరాన్ని సంరక్షిస్తుంది. తరచుగా అనారోగ్య సమస్యలకు గురయ్యేవారు తప్పకుండా శనగపప్పును ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


బరువు తగ్గుతారు:
చాలామంది కారణంగా బరువు పెరుగుతున్నారు. అయితే తగ్గించుకోవడానికి వేయించిన శనగపప్పు ప్రతిరోజు ఉదయం కాళీ కడుపుతో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శనగపప్పులో ఉండే మూలకాలు జీర్ణ క్రియలు శక్తివంతం చేసి..ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో శరీర బరువు కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది.


జీర్ణ క్రియ మెరుగుపడుతుంది:
ప్రస్తుతం అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ వేయించి శనగపప్పును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా బలంగా తయారవుతుంది. సులభంగా బరువు కూడా తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు 


Also Read: Manish Tewari: కరెన్సీ నోట్లపై అంబేదర్క్ ఫొటో.. తెరపైకి కాంగ్రెస్ డిమాండ్.. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook