How To Make Rose Water Face Mist: రోజ్ వాటర్‌ వల్ల చర్మానికి జరిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే.. ఇది చర్మాన్ని సంరక్షించడమేకాకుండా పోషణను అందించి చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చర్మంలో pH స్థాయిలను పెంచేందుకు కూడా సహాయపడుతుంది. మొటిమలు, వాపులు, వడదెబ్బ, నల్లటి వలయాలు, ముడతల సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి వేసవిలో రోజూ వాటర్ ఫేస్ మిస్ట్ అప్లై చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని బ్యూటీ ఎక్స్‌పట్స్ చెబుతున్నారు. కాబట్టి ఈ ఫేస్‌ మిస్ట్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజ్ వాటర్ ఫేస్ మిస్ట్ తయారి పద్ధతి:
• ఫేస్ మిస్ట్‌ను తయారు చేయడానికి ముందుగా రోజ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. 
• ఈ వాటర్‌ను బౌల్‌ పోసుకుని సన్నని మంటపై పెట్టుకోవాలి. 
• అందులో గులాబీ ఆకులను వేసి దాదాపు 45 నిమిషాల పాటు ఉంచాలి.
• ఈ ఆకులు రంగు మారిన తర్వాత స్టవ్‌పై నుంచి బౌల్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. 
• ఈ నీటిని చల్లార్చిన తర్వాత  ఫిల్టర్ చేసి స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి.
• ఇందులో విటమిన్ ఇ నూనె వేసి బాగా మిక్స్‌ చేయాలి.
• అంతే సులభంగా రోజ్ వాటర్ ఫేస్ మిస్ట్ తయారైనట్లే..
• ఈ ఫేస్ మిస్ట్‌ను క్రమం తప్పకుండా చర్మానికి అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook