Samudrik Shastra Nose: మానవ శరీరంలో జ్ఞానేంద్రియాలు ఎంతో ముఖ్యం. అందులో ముక్కు ప్రాధాన్యం ఎక్కువ. అయితే మనుషుల్లో అందరికి ఒకేలాంటి ముక్కు ఆకారం ఉండదు. ముక్కుని చూసి వారి ప్రవర్తన, భవిష్యత్తు తెలుసుకునే అవకాశం ఉంది. భారతీయ వేదాలు, పురాణాలు, శాస్త్రాల్లో ఇలాంటి వాటికి చాలా సమాచారం ఉంది. మీలో ఇలాంటి వాటిపై ఆసక్తి ఉన్నవారు.. మానవుని శరీర అవయవాల ద్వారా ఆయా విషయాలను తెలుసుకోవచ్చు. ముక్కు ఆకారాన్ని బట్టి మనిషి స్వభావం గురించి ఇట్టే తెలిసిపోతుందట. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిలుక లాంటి ముక్కు..
భారతీయ శాస్త్రాల్లో సాముద్రిక శాస్త్రం ప్రకారం.. చిలుక లాంటి ముక్కు కలిగిన వారు తమ జీవితంలో ఎంతో పెద్ద స్థాయికి వెళ్తారట. స్త్రీలలో చిలక ముక్కు లాంటి వాళ్లకి మొట్టినిల్లు పెద్ద కుటుంబంతో ఉంటుందట. ఇలాంటి ముక్కు కలిగిన వారు ఎంతో సౌకర్యవంతంగా ఉంటారట. సూటిగా ముక్కు ఆకారం ఉన్న వ్యక్తులకు మతపరమైన విషయాలపై ఆసక్తి ఎక్కువ చూపుతారట. మందపు ముక్కు ఆకారం కలిగిన వారు ఎక్కువగా తప్పులు చేస్తారట. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముక్కు పొడవు కలిగిన వ్యక్తులు దీర్ఘఆయుషు కలిగి ఉంటారు. 


Also Read: Chandrababu Case: బావ కడిగిన ముత్యంలా బయటికొస్తారు, అంతా కక్ష సాధింపే


చదునైన ముక్కు..
మగవారిలో చదునైన ముక్కు కలిగిన వారు స్త్రీలకు దగ్గరగా ఉంటే చాలా హానికరమట. ముందు కొద్దిగా ఒంగిపోయిన ముక్కు ఉన్నావారు ధనవంతులు అవుతారట. కుడివైపు ముక్కు ఒంగి ఉంటే అలాంటి వారు కఠినంగా ఉంటుండగా.. రెండు వైపులా తిప్పినట్లు ఉంటే అలాంటి వారి దగ్గర డబ్బులు ఉండవని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. 


పెద్ద, చిన్న ముక్కు..
ఎవరికైతే పెద్ద లేదా చిన్నని ముక్కు కలిగి ఉంటారో.. వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అలాంటి వారు పెద్ద ప్రసంగాలు చేస్తారట. వారి ప్రవర్తన మార్చుకుంటే పరిస్థితులు అనుకూలంగా మారతాయట. ముక్కు మూసుకపోయినట్లు ఉన్న వ్యక్తులు తమకు నచ్చిన పనులను మాత్రమే చేస్తారు. చిన్న, చదునైన ముక్కు కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తారని తెలుస్తోంది. ముక్కు రంధ్రాలు పెద్దగా ఉండే వారు రొమాంటిక్ గా ఉంటారట. 


గమనిక: పైన పొందుపరిచన సమాచారం.. సాముద్రిక శాస్త్రంపై ఆధారపడి ఉంది. వీటికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే పైన పేర్కొన్న సమాచారాన్ని 'జీ తెలుగు న్యూస్' ధృవీకరించడం లేదు.


Also Read: Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం... తల్లి మృతి చెందిన బాధ నుంచి తేరుకోకముందే ..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook