Sapodilla Benefits: వర్షాకాలం సపోటా పండ్లు తింటున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోండి!
Sapodilla Benefits In Monsoon Season: వాన కాలంలో సపోటా పండ్లను తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
Sapodilla Benefits In Monsoon Season: సపోటా పండులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు A, C, నియాసిన్, ఫోలేట్, పాంతోతేనిక్ యాసిడ్‌తో పాటు అనేక విటమిన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఐరన్‌తో పాటు పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. ఇవి గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఎముకల దృఢత్వాన్ని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వీటిని సలాడ్స్‌లో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా వీటిని వాన కాలంలో తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సపోటా పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం..:
సపోటాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర సహాయపడుతుంది. దీని కారణంగా మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను దృఢంగా చేస్తుంది.
గుండె ఆరోగ్యం కోసం..:
సపోటాలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
ఎముకల దృఢత్వం:
సపోటాలో క్యాల్షియం, విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇవి రెండు ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శక్తిని పెంచుతుంది:
సపోటాలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీంతో పాటు మానసిక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల ఇవి చర్మాన్ని ఆరోగ్యం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ముడతలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి