Semiya Upma Recipe: సేమియా అంతే అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇక సేమియా ఉప్మా గురించి అయితే చెప్పనక్కర్లేదు. పిల్లలున్నవారైతే వారికి ఒక్కసారైనా ఇంట్లో తయారు చేసుకుని తింటూ ఉంటారు. ప్రస్తుతం చాలా మందికి ఈ సేమియా ఉప్మాను తయారు చేసుకునే క్రమంలో పొరపాటు పడుతున్నారు. అంతేకాకుండా తప్పుడు మసాలను కూడా వినియోగిస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి పొరపాట్లు పడకుండా మేము అందించే ఈ కింది పద్ధతులో తయారు చేసుకుంటే టేస్టీ సేమియా ఉప్మాను పొందుతారు. ఈ ఉప్మాకు కావాల్సిన పదార్థాలేంటో? దీనిని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సేమియా ఉప్మా రెసిపీకి కావల్సిన పదార్థాలు:
1 కప్పు సేమియా
2 టేబుల్ స్పూన్ల నూనె
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
1 చిన్న  తరిగిన ఉల్లిపాయలు
1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
1  తరిగిన పచ్చిమిర్చి,
1/2 టీస్పూన్ పసుపు
1 టీస్పూన్ కారం పొడి
1/2 టీస్పూన్ గరం మసాలా
1/2 కప్పు కూరగాయలు (క్యారెట్, బఠానీలు, మొదలైనవి), తరిగిన
2 కప్పుల నీరు
రుచికి సరిపడా ఉప్పు 
కొత్తిమీర


Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


తయారీ విధానం:
ఒక పాత్రలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
ఉల్లిపాయ వేసి రంగు మారే వరకు వేయించాల్సి ఉంటుంది
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
అందులోనే పసుపు, కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
అలాగే కూరగాయలు వేసి, 2 నిమిషాలు పాటు వేయించాలి. 
అందేలోనే సేమియా వేసి, 2 నిమిషాలు పాటు వేయించాలి.
అందులో తగినన్ని నీరు, ఉప్పు వేసి, బాగా కలపాలి.
నీరు మరిగిన తర్వాత, మంటను తగ్గించి.. 5 నిమిషాలు లేదా సేమియా ఉడికే వరకు ఉడికించాలి.
తర్వాత కొత్తిమీరతో అలంకరించి, వేడిగా వడ్డించుకుంటే ఉంటుంది. ఆ టేస్టే వేరు.


Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter