Weak Immunity Solution : అటు ఇంట్లో పనులు, ఇటు ఆఫీస్ పనులతోనే బిజీ బిజీగా గడిపేస్తున్న జీవితాలలో చాలామందికి సరైన ఆహారం తీసుకునే టైం కూడా ఉండదు. ఇంట్లో చేసుకునే టైం లేక, బయట ఫుడ్ తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. ఆరోగ్యం మీద దృష్టి పెట్టే సమయం కూడా కొంతమందికి ఉండదు. కానీ ఎంత బిజీగా ఉన్నా, మనకంటూ మనం కొంత సమయం తీసుకోవాలి. కనీసం మన ఆరోగ్యం గురించి, మన శరీరం మనకు ఇస్తున్న సంకేతాలనైనా మనం తెలుసుకోగలగాలి. ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతున్నప్పుడు, మన శరీరం ముందుగానే మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది. మనం వాటిని హెచ్చరికగా తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎలర్ట్ అవ్వాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు, శరీరం ఏ చిన్న పని చేసినా అలసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి కూడా మొదలవుతుంది.


రోగనిరోధక శక్తి తగ్గితే జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దానివల్ల మలబద్ధకం, అజీర్ణం, ఆమ్లత్వం, వంటి సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా తిన్న ఫుడ్ సరిగ్గా అరగకపోవడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, కడుపు మంట వంటివి కూడా వస్తూ ఉంటాయి. 


ఎప్పుడూ బద్ధకంగా అనిపించడం కూడా మన శరీరం మనకు ఇస్తున్న సంకేతమే. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఒంట్లో ఉండే బ్యాక్టీరియా తో మన శరీరం పోరాడుతూనే ఉంటుంది. దాని వల్ల మనకి ఎప్పుడూ అలసటగానే అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. 


గాయాలు లేదా పుండ్లు ఎక్కువ కాలం మానకపోయినా అది ఒక సంకేతంగా తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు గాయం మానడానికి కూడా ఎక్కువ కాలం పడుతుంది. కొన్నిసార్లు గాయం క్యాన్సర్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. ఎంతకాలమైనా గాయం మానకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 


రోగనిరోధక శక్తి తగ్గితే తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది. సీజన్ మారిన ప్రతిసారి జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి.


మన శరీరం మనకి ఇస్తున్న ఇలాంటి సంకేతాలను మనం గుర్తించి ఎలర్ట్ అయితే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ఈ సంకేతాలను అర్థం చేసుకొని, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.


Also Read: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా  రక్షించుకోండి..


Also Read: జుట్టు ఆరోగ్యంగా పెంచే 5 సహజ సిద్ధమైన వంటింటి వస్తువులు ఇవే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter