Side Effects of Almonds: బాదం శరీరానికి చాలా రకాల పోషకాలను అందిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల మెగ్నీషియం, ప్రోటీన్,  కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కాబట్టి వీటిని వీటిని తీసుకోవడం వల్ల శరీరం యాక్టివ్‌గా మారడమేకాకుండా.. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు జుట్టు కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అయితే వీటిని అతిగా తీసుకోడం వల్ల శరీరానికి నష్టాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులను అతిగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతిగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు:


కిడ్నీ స్టోన్ సమస్య:
కిడ్నీలో రాళ్ల సమస్య రాకూడదనుకుంటే బాదం పప్పు అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రాళ్ల సమస్యలకు కారణమవ్వచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఆక్సలేట్స్‌ పరిమాణాలు ఎక్కువగా ఉంటాయి దీని వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చు.  


పొట్టలో సమస్యలు:
బాదంపప్పులో ఎక్కువ పీచు పదార్థాలు లభిస్తాయి. వీటిని అతిగా తీసుకుంటే పొట్టలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా  మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని అతిగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


అజీర్తి సమస్య రావొచ్చు:
బాదంలో ఫైబర్‌ పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం వల్ల  అజీర్ణం లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావొచ్చు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటిన్లు లభిస్తాయి. కానీ పరిమాణాలకు మించి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


అధిక బరువు కారణాలు కావొచ్చు:
బరువు వేగంగా పెరగాలనుకుంటే.. బాదం పప్పులను తీసుకోవచ్చు. అయితే బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ సమస్యలకు కూడా దారీ తీయోచ్చు.


అలర్జీ సమస్యలు:
కొంతమందికి బాదంపప్పు తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు గొంతులో దురద కూడా కారణాలవుతున్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook