Momos Recipe: యమ్మీ యమ్మీ మోమోస్ .. తయారు చేసుకోండి ఇలా
Momos Recipe: మోమోస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బయట మోమోస్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Momos Recipe: మోమోస్ భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో ప్రసిద్ధ చెందిన ఆహారం. వీటిని డిమ్ సమ్ అని కూడా పిలుస్తారు. శాకాహారులు ఈ వెజ్ మోమోస్‌ని తినడం వల్ల ఎన్నో లాభాలు పొందుతారు. మోమోస్‌ను పిండి, కూరలతో తయారు చేస్తారు. కొంతమంది దీనిలో సీ-ఫుడ్, చికెన్ లేదా పనీర్‌తో తయారు చేసుకుంటారు.
మోమోస్‌ను ఆవిరి మీద ఉడికించి లేదా డీప్ ఫ్రై చేయవచ్చు. మోమోస్ ను పిల్లలు, పెద్దలు ఎక్కువగా ఇష్టపడుతారు. దీని మీ నచ్చని సాస్‌తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని తింటే మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది. మీరు కూడా ఈ డీష్‌ని ట్రై చేయండి. మీ ఇంట్లో ప్రతిఒక్కరికి బాగా నచ్చుతుంది.
మోమోస్‌కి కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి ఒక కప్పు, క్యాబేజి, క్యాప్సికమ్, క్యారెట్ తురుము పావుకప్పు, మిరియాల పొడి పావు టీస్పూన్, అల్లం ముక్క, వెల్లుల్లి రెండు రెబ్బలు, తెల్ల మిరియాల పొడి పావు టీస్పూన్, సోయా సాస్ ఒక టీస్పూన్, ఉప్పు, నూనె
మోమోస్ తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. అందులోకి ఉప్పు, నీరు వేసి బాగా కలిపి పావుగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మరో గిన్నెలో చిన్నగా తరిగిన క్యాబేజీ, క్యాప్సికం, క్యారెట్, ఉప్పు, మిరియాలు, తరిగిన అల్లం, వెల్లుల్లి. సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. దీని నానబెట్టిన పిండిలోకి వేసి పూరీల్లా చేసి అంచులను మోమోలగా చేసుకోవాలి. దీని నూనెలో లేద స్టవ్‌మీద గిన్నెలో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒక పది నిమిషాల పాటు ఈ చేసిన తర్వాత బయటకు తీసుకోవాలి. ఈ విధంగా మోమోలు రెడీ. దీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సాస్‌తో దీని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని మీ ఇంట్లో తయారు చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. కూరగాయాలు ఇష్టంలేని పిల్లలు కూడా దీని ఇష్టంగా తింటారు.
Also Read Protein Powder: ఆరోగ్యకరమైన ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter