Curd-Lemon Tips: మృదువైన చర్మం, మచ్చల్లేని ముఖం కోసం ఇలా చేస్తే చాలు..ఏ బ్యుటీషియన్ అవసరం లేదు
Curd-Lemon Tips: ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునేది అందం. చర్మం మృదువుగా ఉండాలని..ముఖ్యంపై ఏ విధమైన మచ్చలుండకూడదని అనుకుంటారు. దీనికోసం బ్యుటీషియన్ల చుట్టూ తిరగకుండా..అద్భుతమైన వంటింటి చిట్కా ఉంది. ట్రై చేస్తారా..
Curd-Lemon Tips: ఆరోగ్యంతో పాటు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అమ్మాయిలు కోరుకునేది అందం. చర్మం మృదువుగా ఉండాలని..ముఖ్యంపై ఏ విధమైన మచ్చలుండకూడదని అనుకుంటారు. దీనికోసం బ్యుటీషియన్ల చుట్టూ తిరగకుండా..అద్భుతమైన వంటింటి చిట్కా ఉంది. ట్రై చేస్తారా..
ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణ అందరికీ అవసరమే. ముఖ్యంగా అమ్మాయిలకు. చర్మం మృదువుగా ఉండాలని..ముఖంపై పింపుల్స్ ఉండకూడదని ఆరాటపడుతుంటారు. దీనికోసం మార్కెట్‌లో లభించే అన్ని రకాల క్రీములు వాడేస్తుంటారు. కొన్ని ఫలితాల్ని ఇచ్చినా ఇవ్వకపోయినా..వికటించే ప్రమాదం మాత్రం లేకపోలేదు. అందుకే సాధ్యమైనంతవరకూ సహజ సిద్ధమైన చిట్కాల్నే వాడటం మంచిది. ఫలితాలుంటాయి. అదే సమయంలో ఏ విధమైన దుష్పరిణామాలుండవు.
దీనికోసం ఆయుర్వేద వైద్య నిపుణులు పెరుగు, నిమ్మ కలిపిన మిశ్రమాన్ని సూచిస్తున్నారు. ఇది చాలా రకాల సమస్యల్ని దూరం చేస్తుంది. పెరుగులో ఉండే గుణాలు..చర్మాన్ని మెరుగుపర్చేందుకు, యాక్ని, పింపుల్స్ లేదా రెండింటినీ దూరం చేయవచ్చు. నిమ్మలో ఉండే విటమిన్ సి, ఇతర గుణాలు చర్మానికి సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయి. ఈ నేపధ్యంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరుగు, నిమ్మ కలిపిన మిశ్రమంతో ఏ విధమైన ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
డ్రై స్కిన్‌ను మెరుగుపర్చేందుకు సమస్యల్నించి విముక్తి పొందేందుకు పెరుగు, నిమ్మ చాలా బాగా ఉపయోగపడుతాయి. పెరుగు, నిమ్మలో ఉండే గుణాలు ముఖ సంరక్షణ, పింపుల్స్ వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉంటే..మీ ముఖంపై పెరుగు, నిమ్మ కలిపి రాయవచ్చు. ఇలా చేస్తే డ్రైనెస్ నుంచి విముక్తి పొందవచ్చు.
Also read: Pickles Side Effects: రుచిగా ఉందని..అతిగా లాగిస్తే మగోళ్లకు ఆ సమస్య వెంటాడుతుందా
యాక్నే, పింపుల్స్ దూరం చేసేందుకు పెరుగు, నిమ్మల ఉపయోగం చాలా కీలకమిక్కడ. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పింపుల్స్ కారణంగా తలెత్తే వాపు కూడా దూరమౌతుంది. చర్మాన్ని తేమగా ఉంచేందుకు పెరుగు, నిమ్మ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల చర్మంలో తేమ పుడుతుంది. ఈ మిశ్రమం వినియోగించడం వల్ల చర్మం కోమలంగా ఉంచడంలో దోహదపడుతుంది. అందుకే మీరు రోజూ ముఖంపై పెరుగు, నిమ్మ మిశ్రమం రాయాల్సి ఉంటుంది.
పెరుగు, నిమ్మరసం మిశ్రమం ఎలా చేయాలంటే..ముందుగా రెండు స్పూన్స్ పెరుగు తీసుకుని..ఇందులో 1 స్పూన్ నిమ్మరసం కలుపుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని..అరగంట తరువాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి కనీసం రెండుసార్లు వాడితే మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఏ విధమైన దుష్పరిణామాలు కన్పించవు.
Also read: Home Remedies For Dark Neck: మెడపై చర్మం నల్లగా మారుతోందా.. అయితే ఇది మీ కోసమే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook