Anti Ageing Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, కాలుష్యం, నిద్ర లేకపోవడం వంటి కారణాలు ఏజీయింగ్‌కు దారి తీస్తున్నాయి. అంటే వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు వెంటాడుతున్నాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే చర్మ సంరక్షణలో హనీ ఫేస్ మాస్క్ తప్పకుండా ఉండాల్సిందేనంటున్నారు సౌందర్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో ప్రధానంగా కన్పిస్తున్న సమస్య ఏజీయింగ్. తక్కువ వయస్సుకే వృద్దాప్యం కన్పించడం. అయితే సక్రమమైన అలవాట్లు, సరైన ఆహారం, వ్యాయామం, జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వయసు మీరినా వృద్ధాప్యం కన్పించదు. ప్రకృతిలో సహజసిద్దమైన మాయిశ్చరైజర్ తేనె ఫేస్ మాస్క్ రాయడం వల్ల చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది. హనీ ఫేస్ మాస్క్ ద్వారా డెడ్ స్కిన్ తొలగించవచ్చు. ఫలితంగా చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. 


చర్మం నిర్జీవమవడం, ముడతలు పడి పటుత్వం కోల్పోవడం వృద్ధాప్య లక్షణాలు ముఖంలో స్పష్టంగా కన్పించడం వంటి సమస్యల్నించి కాపాడుకునేందుకు మార్కెట్‌లో చాలా ఉత్పత్తులున్నాయి. అయితే వీటిలో కెమికల్స్ నిండి ఉంటాయి. ఫలితంగా ప్రయోజనానికి బదులు చర్మానికి చేటు కలుగుతుంది. అందుకే గ్లోయింగ్ చర్మం కోసం హోమ్ రెమిడీస్ మంచి ఫలితాలనిస్తాయి. ఇందులో భాగంగానే హనీ ఫేస్ మాస్క్.  ఇది డెడ్ స్కిన్ తొలగించి మృదువైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. 


హనీ ఫేస్ మాస్క్ తయారీ విధానం


హనీ ఫేస్ మాస్క్ తయారీకు కావల్సింది గ్రీన్ టీ, కొద్దిగా తేనె. అంతకుమించి మరేమీ అవసరం లేదు. తేనెతో ఫేస్ మాస్క్ చేసేందుకు ముందుగా ఓ ప్యానెల్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు వేసి తగినంత గ్రీన్ టీ ఆకులు కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని 2-3 నిమిషాలు స్లో ఫ్లేమ్‌పై మరగనివ్వాలి. ఈ నీళ్లను వడకాచి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆకుల్ని పేస్ట్ చేసి ఇందులో కొద్దిగా తేనె కలపాలి. ఇప్పుడీ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. హనీ ఫేస్ మాస్క్ తయారైనట్టే.


తేనె ఫేస్ మాస్క్ రాసేముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఓ మృదువైన బ్రష్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. దాదాపు 15-20 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తరువాత కాటన్ సహాయంతో క్లీన్ చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.


Also read: Anti Ageing Tips: ఆ ఫేస్‌ప్యాక్ రాస్తే 2 నెలల్లో ముఖంపై ముడతలు మాయం, నిత్య యౌవనం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook