Skin Care Tips: చర్మ సంరక్షణ, అందం మెరుగుపర్చేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వయస్సు మీరకుండానే మీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటే..ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మం అందంగా, నిగారింపుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చర్మం అందం పెంచేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో కొంతమందికి తక్కువ వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ వస్తుంటాయి. జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చర్మం నిగారింపు ఉండాలంటే శరీరానికి కొన్ని రకాల పోషక పదార్ధాలు అవసరం. ఎందుకంటే మనం తీసుకునే ఆహార పదార్ధాల ప్రభావం కచ్చితంగా చర్మంపై పడుతుంటుంది. అందుకే చర్మ సంరక్షణ, చర్మానికి అందం కోసం కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్ నుంచి దూరం చేయాలి. ఆ వివరాలు తెలుసుకుందాం..


ప్రోసెస్డ్ ఫుడ్ అనేది చర్మానికి పూర్తిగా హాని కల్గిస్తుంది. ఎందుకంటే ప్రోసెస్డ్ ఫుడ్‌లో సోడియం, ప్రిజెర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చర్మానికి హాని చేకూరుతుంది. చర్మంలో వాటర్ రిటెన్షన్, స్వెల్లింగ్, కొలేజన్ లోపం ఏర్పడుతుంది. ఒకవేళ మీరు రోజూ ప్రోసెస్డ్ ఫుడ్ తింటుంటే..ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ ఏర్పడతాయి. పాస్తా, నూడిల్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. 


మీకు టీ, కాఫీ తాగే అలవాటుంటే..యుక్త వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావచ్చు. ఎందుకంటే టీ, కాఫీలో ఉండే కెఫీన్ అనేది ముఖం తేమను లాగేస్తుంది. ఎక్కువగా టీ, కాఫీ తాగే వారిలో ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ త్వరగా వస్తాయి. 


ఇక పంచదార అనేది ఆరోగ్యానికే కాదు..చర్మానికి కూడా మంచిది కాదు. పంచదార రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ఫలితంగా చర్మానికి హాని కలుగుతుంది. మీ చర్మాన్ని యౌవ్వనంగా, కాంతివంతంగా ఉంచాలనుకుంటే..పంచదార పదార్ధాలకు దూరంగా ఉండాలి. 


Also read: Weight Loss Tips: ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఇలా రోటీలతో కేవలం 10రోజుల్లో బరువు తగ్గొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook