Skin Care Summer Tips: షుగర్ స్క్రబ్‌తో మృదువైన, మచ్చలేని చర్మం మీ సొంతం!
Skin Care Summer Tips: చర్మ సమస్యలతో బాధపడేవారు షుగర్ స్క్రబ్ వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Skin Care Summer Tips: చక్కెరలో ఉండే గుణాలు చర్మానికి సహజమైన ఎక్స్‌ఫోలియంట్ పని చేస్తాయని మీకు తెలుసా? అవును ఇందులో ఉండే గుణాలు చర్మానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని సౌదర్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరలో ఉండే గుణాలు చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మంపై మూసుకుపోయిన రంధ్రాలను కూడా తెరవడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు మీ చర్మం తేమను లాక్ చేయడమేకాకుండా హైడ్రేట్‌గా ఉంచేందుకు కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎలాంటి సమస్యలు లేని చర్మాన్ని పొందడానికి షుగర్ స్క్రబ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చర్మంపై ఉన్న టానింగ్ సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా మృదువైన, మచ్చలేని పొందవచ్చు. అయితే ఈ షుగర్ స్క్రబ్‌ను ఎలా తయారు చేయాలో, దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
షుగర్ స్క్రబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
½ కప్పు కొబ్బరి నూనె
గోధుమ పిండి
1 కప్పు చక్కెర
షుగర్ స్క్రబ్ తయారి విధానం:
ఈ షుగర్ స్క్రబ్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది.
అదే కప్పులో అరకప్పు కొబ్బరి నూనె ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేసి, ఒక టీ స్పూన్ గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత 15నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఇలా చేస్తే సులభంగా షుగర్ స్క్రబ్ సిద్ధమైనట్లే.
వినియోగించే పద్ధతి:
ఈ షుగర్ స్క్రబ్ అప్లై చేసే ముందు తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.
ఈ షుగర్ స్క్రబ్‌ను తేలికపాటి చేతులతో ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.
ఇలా అప్లై చేసిన తర్వాత 7 నిమిషాలు అలాగే ఉంచాల్సి ఉంటుంది.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి