చర్మ సంరక్షణ అనేది ఏ సీజన్‌లో‌నైనా అవసరమే. ఎందుకంటే చలికాలంలో ఓ విధమైన సమస్యలు, వేసవిలో మరో రకం ఇబ్బందులు ఎదురౌతుంటాయి. వేసవిలో మాత్రం ఎండల తీవ్రత నేపధ్యంలో అదనపు జాగ్రత్తలు చాలా అవసరమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పటికప్పుడు చర్మాన్ని పరిరక్షించుకోకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. వేసవిలో ఎండల తీవ్రత కారణంగా ట్యానింగ్, డార్క్ సర్కిల్స్, డీ హైడ్రేట్ కావడం వంటి సమస్యలు చాలా ఉంటాయి. అయితే చర్మాన్ని సంరక్షించుకోవడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే చర్మం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. 


అతి నీలలోహిత కిరణాల్నించి రక్షణ


వేసవిలో అతిపెద్ద సవాలు ఎండల తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే సూర్యుని నుంచి నేరుగా వచ్చే అతి నీలలోహిత కిరణాలు కల్గించే హాని నుంచి చర్మాన్ని రక్షించుకోవడం చాలా చాలా అవసరం. లేకపోతే కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీస్తుంది. అందుకే వేసవి వచ్చిందంటే చాలా సన్‌స్క్రీన్ లోషన్స్ ఎక్కువగా వాడుకలో వస్తుంటాయి. సన్‌స్క్రీన్ లోషన్స్ ద్వారా స్కిన్‌కేర్ చేసుకోవాలి. ఇక వేసవిలో చాలామందికి చెమట కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు క్లెన్సర్ వాడటం మంచిది. అయితే రసాయనాలు లేని క్లెన్సర్ వాడటం మంచిది.


ఎండాకాలంలో ముఖానికి నూనె లేదా సీరమ్ ఉపయోగించడం ఎంతమాత్రం మంచిది కాదు. వేసవి కారణంగా చెమట, జిడ్డు ఎక్కువగా ఉంటుంది. నూనె వంటివి రాస్తే..చర్మం మరింత జిడ్డుగా మారి నల్లగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. 


ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ముఖంపై అలసట, చికాకు లేకుండా ఉండాలంటే టోనర్ తప్పకుండా వాడాల్సి వస్తుంది. టోనర్ అనేది చర్మంలో పీహెచ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఎండలోంచి వచ్చిన వెంటనే..చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవడమనేది ఓ అలవాటుగా చేసుకోవాలి.


ముఖ్యంగా వేసవి కాలంలో సాధ్యమైనంత వరకూ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. చర్మానికి తగిన తేమ లేకపోతే..అనారోగ్యం కారణంగా చర్మ సమస్యలు వెంటాడుతాయి. బ్లాక్‌హెడ్స్, డ్రై స్కిన్ వంటివి సమస్యలెదురవుతాయి. చర్మం తేమగా ఉండేందుకు వీలుగా మాయిశ్చరైజర్ తప్పకుండా ఉపయోగించాలి. మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం మాయిశ్చరైజర్ వాడాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు వీలుగా వేసవిలో ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడమే కాకుండా..వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, దోసకాయలు తీసుకుంటే మంచి ఫిలితాలుంటాయి.


Also read: Cholesterol Diet: డైట్‌లో ఈ పదార్ధాలు ఉంటే..కేవలం నెలరోజుల్లో కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ తగ్గడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook