Skin Care Tips: ఎండలో, చలిలో ముఖం పాడవుతుందా, అద్భుతమైన చిట్కాలివే
Skin Care Tips: చలికాలంలో సహజంగా చర్మం డ్రైగా నిర్జీవంగా ఉంటుంది. కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా చర్మ సమస్యల్ని చాలా సులభంగా దూరం చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
చలికాలంలో గాలుల కారణంగా ముఖం డ్రైగా , నిర్జీవంగా మారిపోతుంది. ఎండలో ఉంటే ట్యానింగ్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని చిట్కాలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ముఖాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఏ చిట్కాలు అమలు చేయాలో తెలుసుకుందాం..
బాదం, పచ్చి పాలు
బాదంను మిక్స్ చేసి పౌడర్‌గా చేసుకోవాలి. ఈ పౌడర్‌ను పాలలో నానబెట్టాలి. అరగంట తరువాత ఈ మిశ్రమంలో పసుపు కలపాలి. ఆ తరువాత ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాలుంచాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ దూరమౌతుంది. ముఖంపై ఉన్న ట్యానింగ్, బ్లాక్‌నెస్ దూరమౌతుంది. చర్మం లోపల్నించి మాయిశ్చరైజ్ అవుతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
నిమ్మ, పసుపు
మీగడ చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని చాలా మెరుగైన పద్దతిలో మాయిశ్చరైజ్ చేస్తుంది. మీగడలో పసుపు, నిమ్మరసం కలిపి రాయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి..కాస్సేపటికి వేడి నీటిలో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ట్యానింగ్ దూరమౌతుంది.
నిమ్మ, తేనె
నిమ్మ, తేనె రెండింట్లోనూ ఔషధ గుణాలు నిండుగా ఉంటాయి. ముఖంపై నిమ్మ, తేనె రెండింటి మిశ్రమం రాయడం వల్ల ముఖంపై ఉండే డ్రైనెస్ పోతుంది. నిమ్మ, తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ సమస్యల్ని నిర్మూలిస్తాయి.
నిమ్మరసం
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మ చర్మానికి చాలా మంచిది. నిమ్మరసంలో పసుపు కలిపి రాసుకోవాలి. కాస్సేపటి తరవాత ముఖాన్ని వేడి నీటితో కడగాలి. నిమ్మ, పసుపు మిశ్రమంతో ట్యానింగ్ దూరమౌతుంది. చర్మకణాలు తెర్చుకుని చర్మం కాంతివంతమౌతుంది.
ఆయిల్ మస్సాజ్
చలికాలంలో ఆర్గాన్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వాడకం ద్వారా చర్మ సమస్యల్ని దూరం చేయవచ్చు. ఈ ఆయిల్స్‌తో ముఖాన్ని మస్సాజ్ చేస్తే డ్రైనెస్ పోతుంది. డైట్‌లో మార్పులు చేసుకోవాలి. మనం తినే ఆహార పదార్ధాలు కూడా ప్రబావం చూపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే..డైట్ చాలా ముఖ్యం. దీనికోసం పాలకూర, బీట్‌రూట్, బొప్పాయి చాలా మంచిది.
Also read; Hair Care Tips: మీ కేశాలు మృదువుగా, బలంగా ఉండాలంటే రోజూ ఈ జెల్ రాస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook