ముఖంపై పింపుల్స్ వల్ల చాలా సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా అమ్మాయిలకు మరింత ఇబ్బంది కలుగుతుంది. పింపుల్స్ కారణంగా ముఖంపై ఏర్పడే మచ్చలతో అందంపై ప్రభావం పడుతుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖంపై ఏర్పడే మొటిమలు, పింపుల్స్ సమస్యను యాంటీ పింపుల్స్ డ్రింక్స్‌తో తొలగించవచ్చు. రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల పింపుల్స్, నల్లటి మచ్చలు, మొటిమల సమస్యలు నిర్మూలించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రీన్ టీ, నిమ్మ


గ్రీన్ టీను సాధారణంగా బరువు తగ్గించేందుకు ఉపయోగిస్తుంటారు. గ్రీన్ టీని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే చర్మ సంరక్షణకు సైతం చాలా ప్రయోజనకరం. గ్రీన్ టీ తయారు చేసుకున్న తరువాత చివర్లో నిమ్మరసం కొద్దిగా కలుపుకుని సేవించాలి. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, నిమ్మలో ఉండే విటమిన్ సి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అటు పింపుల్స్ సమస్య కూడా తొలగిపోతుంది. 


ఉసిరి, అల్లం


ఉసిరిని సాధారణంగా కేశాల ఆరోగ్యం కోసం వినియోగిస్తుంటారు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పింపుల్స్‌కు కారణమయ్యే కీటాణువుల్ని దూరం చేయవచ్చు. ఉసిరిరసం, అల్లం కలిపి తాగితే మెరుగైన ఫలితాలుంటాయి. ముఖంపై మచ్చలు కూడా దూరమౌతాయి. చర్మానికి నిగారింపు వస్తుంది. 


వేప, తేనె


వేపను ఔషధచెట్టుగా పిలుస్తారు. వేప చెట్టులో ప్రతి భాగం శరీరానికి ఆరోగ్యకరం. వేపాకులతో యాంటీ బ్యాక్టీరియల్ డ్రింక్స్ తయారుచేయవచ్చు. క్రమం తప్పకుండా తీసుకుంటే సహజసిద్ధంగానే పింపుల్స్ దూరమౌతాయి. 


Also read: Summer Skin Care: వేసవి చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసే చిట్కా ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook