How To Make Glycerin Hand Cream: మృదువైన, మెరిసేలా చేతులను ప్రతి రోజు ఎక్స్‌ఫోలియేషన్ చేయడం చాలా ముఖ్యం. ఎక్స్‌ఫోలియేషన్ కోసం మార్కెట్‌ చాలా రకాల ప్రోడక్ట్స్ లభిస్తున్నాయి. కానీ వీటిని వినియోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. వీటిని బదులుగా బ్యూటీ ఎక్స్‌పర్ట్ సూచించిన సహజంగా తయారు చేసిన గ్లిజరిన్ వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వాడడం వల్ల మీ చర్మం సహజంగా మెరుస్తూ, యవ్వనంగా మారుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి గ్లిజరిన్ హ్యాండ్ క్రీమ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్లిజరిన్ హ్యాండ్ క్రీమ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:


  1. 1 టీ స్పూన్‌ బాదం నూనె

  2. 1 టీ స్పూన్‌ గ్లిజరిన్

  3. 2 టీ స్పూన్‌ కొబ్బరి నూనె

  4. 1 టీ స్పూన్‌ రోజ్ వాటర్


గ్లిజరిన్ తయారి విధానం:


  • గ్లిజరిన్ తయారు చేయడానికి ముందుగా ఒక పాన్ తీసుకోవాల్సి ఉంటుంది. 

  • అందులో 1 టీ స్పూన్‌ బాదం నూనె, 2 టీ స్పూన్‌ కొబ్బరి నూనె వేసుకుని వేడి చేయాలి.

  • ఈ రెండు నూనెలను బాగా వేడి చేసిన తర్వాత ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి. 

  • ఈ రెండింటి పక్కన పెట్టుకోవాలి.

  • ఇదే బౌల్‌లో  రోజ్ వాటర్,  గ్లిజరిన్ వేసి మిక్స్‌ చేసుకోవాలి. 

  • ఈ పదార్థాలన్నింటినీ మిక్స్‌ చేసుకుని ఒక చిన్న డబ్బలో భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.

  • గ్లిజరిన్ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు చేతులకు అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. 

  •  


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: BRS MLA Gampa Govardhan: రైస్ మిల్లు సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వీడియో వైరల్



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook