Skin Care Tips: తేనె మాయిశ్చరైజర్‌తో మీ ముఖం 1 రోజులో మృదువుగా, మెరిసేలా తయారవుతుంది!
How To Make Honey Moisturizer: తేనెతో తయారు చేసి మాయిశ్చరైజర్‌ను ప్రతి రోజు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
How To Make Honey Moisturizer: తేనె చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, మినరల్స్ కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతి రోజు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరానికే కాకుండా చర్మానికి కూడా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. తేనె మాయిశ్చరైజర్‌ను తయారు చేసుకుని వినియోగించడం వల్ల ముఖంపై మురికి సులభంగా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ముఖం మృదువుగా, మెరిసేలా తయారవుతుంది. అయితే ఈ మాయిశ్చరైజర్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తేనె మాయిశ్చరైజర్ తయారీకి అవసరమైన పదార్థాలు:
✺ ఒక టీస్పూన్ నిమ్మరసం
✺ ఒక టీస్పూన్ తేనె
✺ 5 నుంచి 6 చుక్కల గ్లిజరిన్
✺ ఒక గ్రీన్ టీ బ్యాగ్
ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..
మాయిశ్చరైజర్ తయారి పద్ధతి:
✺ ముందుగా మాయిశ్చరైజర్ చేయడానికి ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
✺ అందులో ఒక టీ స్పూన్ గ్లిజరిన్ వేయాలి.
✺ ఇలా వేసుకున్న తర్వాత గ్రీన్ టీ నీరుతో పాటు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
✺ వీటన్నింటిని బాగా మిక్స్ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
✺ ఇలా తయారు చేసుకన్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
✺ ఈ మాయిశ్చరైజర్ ప్రతి రోజు రాత్రి పూట ముఖానికి అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
✺ అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK