COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reason For White Hair And Causes In Young Age: ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్యలు జుట్టు రాలడం మొదటి సమస్య అయితే, రెండవది తెల్ల జుట్టు సమస్య. ఈ సమస్య కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ వస్తోంది. అయితే జుట్టు రాలడం కారణంగా బట్టతల వస్తే.. ఈ తెల్ల జుట్టు వల్ల ముఖం అంద హీనంగా తయారవుతోంది. ప్రస్తుతం చాలామంది ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఖరీదైన అనేక రకాల హెయిర్ డైలను వినియోగిస్తున్నారు. కొంతమంది వీటిని వినియోగించినప్పటికీ ఫలితాలు శూన్యమని చెబుతున్నారు. అసలు తెల్ల జుట్టు రావడానికి కారణాలేంటి? తెల్ల జుట్టు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


తెల్ల జుట్టు రావడానికి కారణాలు:
ధూమపానం:

పూర్వీకులు తెల్ల జుట్టు అనేది వృద్ధాప్య దశలో మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం యువతలో కూడా తెల్ల జుట్టు విచ్చలవిడిగా పెరిగిపోతోంది.  యువతలో ఎక్కువగా తెల్ల జుట్టు రావడానికి ప్రధాన కారణం ధూమపానమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేసే వారిలో చాలావరకు తెల్ల జుట్టు వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ధూమపానం చేయకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


థైరాయిడ్:
కొంతమంది మహిళల్లో థైరాయిడ్ కారణంగా కూడా తెల్ల జుట్టు వస్తోంది. కాబట్టి థైరాయిడ్ వచ్చిన వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా థైరాయిడ్ కూడా నియంత్రణలో ఉంటుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


వాతావరణ కాలుష్యం:
జీవనశైలి మారేకొద్ది వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. దీనికి కారణంగా కాలుష్యం సులభంగా పెరిగిపోతోంది. కాబట్టి కాలుష్య వాతావరణం లోని ఉన్ననగరాల్లో నివసించే చాలామందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


మానసిక ఒత్తిడి:
ప్రస్తుతం చాలామందిలో మానసిక ఒత్తిడి కారణంగా కూడా తెల్ల జుట్టు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి కారణంగా తెల్ల జుట్టు రావడమే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సమస్యతో బాధపడేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి