Split Ends In Hair: తరచుగా జుట్టు చిట్లిపోతోందా? ఈ హెయిర్ మాస్క్‌తో కేవలం 2 రోజుల్లో చెక్ పెట్టొచ్చు!
Split Ends In Hair: జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ హెయిర్ మాస్క్‌లను వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తీవ్ర జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Split Ends In Hair: వేసవిలో జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైపోయింది. వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా చాలా మందిలో జుట్టు చిట్లిపోతోంది. కాబట్టి ఇలాంటి సమస్యల కారణంగా పురుషుల్లో బట్టతల సమస్యలు వస్తున్నాయి. వేడి నీటి స్నానం, హెయిర్ కలరింగ్ కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ కింది చిట్కాలను వినియోగించడం వల్ల కూడా సులభంగా జుట్టు చిట్లిపోవడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
తేనె, పెరుగు హెయిర్ మాస్క్‌తో సుభంగా ఉపశమనం లభిస్తుంది:
ప్రస్తుతం చాలా మందిలో జుట్టు చివరి భాగాల్లో జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తేనె, పెరుగు హెయిర్ మాస్క్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో అరకప్పు పెరుగు, 6 చెంచాల తేనె మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తేలికపాటి చేతులతో జుట్టుకు మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక గంట పాటు ఆరనివ్వండి. ఇలా ఆరిన తర్వాత జుట్టును సాధరణ షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
నల్ల పెసరి పప్పు హెయిర్ మాస్క్:
జుట్టు సమస్యలను తగ్గించడానికి నల్ల పెసర్ల పప్పులతో తయారు చేసిన హెయిర్ మాస్క్ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మాస్క్‌ను తయారు చేయడానికి ఒక చిన్న కప్పు నల్ల పెసరి పప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కప్పులతో నీటి వేసి రాత్రంతా నానబెట్టి ఉంచాలి. ఆ తర్వాత నల్ల పెసరి పప్పును గ్రైడర్ వేసి మిశ్రమంలా తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇందులో 7-8 చెంచాల పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేసిన తర్వాత జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి