Mangla Gauri Vratam 2022: తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు అఖండ సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలోని మంగళవారం (Sravana First Tuesday) రోజున ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ మాసంలోని ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటూ.. తల్లి మంగళ గౌరీని పూజిస్తారు.  ఈ మంగళ గౌరీవ్రతం (Mangla Gauri Vratam 2022) ఎప్పుడు, వ్రత విధానం తదితర విషయాలు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళ గౌరీ వ్రతం తేదీ
శ్రావణంలోని అన్ని మంగళవారాల్లో వివాహిత స్తీలు తమ భర్తలు దీర్ఘాయువుతో ఉండాలని మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు. పెళ్లికానీ అమ్మాయిలు ఈ వ్రతాన్ని పాటిస్తే.. తగిన వరుడు లభిస్తాడని నమ్ముతారు. ఈ ఏడాది శ్రావణ మాసం 14 జూలై 2022న ప్రారంభమైంది. ఇది ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. శ్రావణ మాసంలో మెుత్తం 4 మంగళవారాలు ఉంటాయి. ఈ రోజుల్లో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. 


మొదటి మంగళ గౌరీ వ్రతం - జూలై 19, 2022
రెండో మంగళ గౌరీ వ్రతం - జూలై 26, 2022
మూడో మంగళ గౌరీ వ్రతం - ఆగస్టు 2, 2022
నాల్గో మరియు చివరి మంగళ గౌరీ వ్రతం - ఆగస్టు 9, 2022 


మంగళ గౌరీ పూజా విధానం
ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. ఈ వ్రతం చేసేటప్పుడు పూజా సమయంలో కలశాన్ని ఉంచి దానిపై ఎరుపు రంగు వస్త్రం కప్పండి. అమ్మవారి ఫోటో లేదా విగ్రహం పెట్టి పూజ ప్రారంభించండి. అంతేకాకుండా తల్లి ముందు స్వీట్స్ పెట్టండి.  మాత గౌరీకి 16 నెంబర్ అంటే చాలా ఇష్టం.అందుకే పూజలో 16 వస్తువులు ఉండేలా చూసుకుంటారు. అనంతరం మంగళ గౌరీ వ్రత కథను వినండి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించండి. మంగళగౌరీ వ్రతంలో రోజుకు ఒక్కసారే భోజనం చేయాలి. ఇందులో ఉప్పు ఉండకూడదు. 


Also Read: Sravana First Saturday: శ్రావణ తొలి శనివారం ఈ 5 రాశులవారికి ప్రత్యేకం!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.