Foods Not To Eat In Rainy Season: వేసవిలోని మండే ఎండల నుండి వర్షాకాలం కొంత ఉపశమనం తెస్తుంది. కానీ ఇది ఆరోగ్య సమస్యలను కూడా ఎక్కువగానే తెస్తుంది అని కొందరికే తెలుసు. వర్షాకాలం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ కాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఇంటికి వచ్చే ప్రతి వస్తువు ను శుభ్రం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం వంటి విషయాలపై జాగ్రత్తగా ఉండటం మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్షాకాలంలో బ్యాక్టీరియా పెరుగుదలకు ఎక్కువ స్కోప్ ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. వర్షం అనగానే గుర్తొచ్చే సమోసా, పకోడి, స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉండడమే ఆరోగ్యానికి మంచిది. అసలు ఈ వర్షాకాలంలో ఏ ఆహారాలను తీసుకోకూడదో చూడండి:


ఆకుకూరలు:


ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ వర్షా కాలంలో ఆకు కూరలకు దూరంగా ఉండడం మంచిది. వర్షాకాలంలో తేమ, తక్కువ ఉష్ణోగ్రతల వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా ఆకుకూరలపై అలాంటి బ్యాక్టీరియా ఉంటే అవి కడుపు ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. పాలకూర, మెంతికూర, కాబేజీ, కాలిఫ్లవర్ వంటి ఆకుకూరలను ఈ కాలంలో కుదిరినంత వరకు దూరంగా ఉండండి.


సీ ఫుడ్:


వర్షాకాలంలో చేపలు, రొయ్యలు వంటి సీ ఫూడ్ లు కూడా తినకూడదు. ఎందుకంటే, ఈ కాలంలో నీటిలో ఉండే పాథోజెన్స్, బ్యాక్టీరియా చేపలను వాటిని తినేవారిని ఇన్ఫెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా, ఈ కాలం సీ ఫూడ్ బ్రిడింగ్ సీజన్ కావడంతో, ఇందులో రకరకాల మార్పులు జరగుతాయి.


మసాలా వేసిన లేదా వేయించిన ఆహారాలు:
  
వేయించిన ఆహారాలను కొద్దిగా తినడం బాగానే ఉంటుంది కానీ ఎక్కువగా తినడం వల్ల కడుపు సమస్యలు, అజీర్ణం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వాటిని తగ్గించడం మంచిది.


కూల్ డ్రింక్స్:
  
వర్షాకాలంలో కూడా ఎక్కువగా నీరు తాగడం చాలా ముఖ్యం. కానీ గ్యాస్ ఉండే కూూల్ డ్రింక్స్ తగ్గించాలి. ఎందుకంటే అవి జీర్ణ ప్రక్రియను బలహీనపరచి, శరీరంలోని ఖనిజాల స్థాయిని తగ్గిస్తాయి. కూల్ డ్రింక్స్ కి బదులుగా నిమ్మకాయ నీళ్లు, జల్జీరా వంటి హైడ్రేటింగ్ డ్రింక్స్ తాగవచ్చు.


మష్రూమ్స్:
  
మష్రూమ్స్ తడిగా ఉండే మట్టిలో పెరుగుతాయి. ఈ కాలంలో అవి బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, వర్షాకాలంలో మష్రూమ్స్ తినడం మంచిది కాదు.


పెరుగూ:


వర్షాకాలంలో పెరుగును తినడం కూడా అంత మంచిది కాదు. పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. దాని వల్ల జలుబు చేసే అవకాశం ఉంటుంది. సైనసైటిస్ ఉన్నవారు దీనిని పూర్తిగా తగ్గించుకోవాలి. 


రోడ్డు పక్క ఆహారాలు:
  
చాట్, పానీ పూరి, దహీ పూరి వంటి రోడ్ సైడ్ ఫుడ్స్ ఏ కాలంలో అయినా తినకూడదు. కానీ వర్షాకాలంలో అసలు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ఆహారాలు సులభంగా కంటామినేట్ అవుతాయి.


వర్షాకాలంలో ఈ ఆహారాలను తగ్గించడం మంచిది. దాని వల్ల జలుబు, జ్వరం, లాంటివి రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ


Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter