Stress Relief Tips: ఒత్తిడి తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు ఇవే.. ఇలా చేస్తే చాలు..
Stress Relief Tips: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఒత్తిడి సమస్య బారిన కూడా పడుతున్నారు. ఒత్తిడి కారణంగా చాలా మంది తీవ్ర ప్రాణాంతక సమస్యలకు గురవుతున్నారు.
Stress Relief Tips: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఒత్తిడి సమస్య బారిన కూడా పడుతున్నారు. ఒత్తిడి కారణంగా చాలా మంది తీవ్ర ప్రాణాంతక సమస్యలకు గురవుతున్నారు. అయితే వీటికి ప్రధాన కారణం తీసుకునే ఆహారమేనని నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యల బారిన పడితే.. పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒత్తిడి తగ్గించడానికి పలు నియమాలు పాటిస్తే చాలని నిపుణులు తెలుపుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒత్తిడి ఇలా తగ్గించుకోండి:
ధ్యానం, వ్యాయామం:
క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం రోజూ వ్యాయామాలతో పాటు, ధ్యానం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫోన్ అతిగా వాడొద్దు:
పలు నివేదికల ప్రకారం..ఫోన్ అతిగా వినియోగించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు.. ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే నివేదికలు పేర్కొన్న విధంగా స్క్రీన్ చూడటం వల్ల ఒత్తిడి పెరుగడమేకాకుండా.. తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ఆరోగ్యకరమైన ఆహారం తినండి:
ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి చాలా అవసరం. కావున అందరూ ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తరచుగా సూచిస్తారు. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రోటీన్, న్యూట్రిషన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, గింజలు, బీన్స్, విత్తనాలను తీసుకోవాలి.
ఎక్కువ సమయం పాటు పని చేయోద్దు:
ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం, పని చేయడం.. అందులో ఎక్కువ సేపు పని చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఒత్తిడి తగ్గించుకోవడానికి వారాని ఒక్కసారి స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook