How To Make Hair Roots Strong: మనలో చాలా మంది జుట్టును రక్షించుకోవడానికి వివిధ రకాల ప్రయ్నాలు చేస్తారు. ఎందుకంటే జుట్టు అందంగా ఉంటేనే ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. అయితే చాలా మంది జుట్టు అందంగా కనిపించేందుకు మార్కెట్‌లో లభించే చాలా రకాల హెయిర్‌ ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి, నటులు తమ జుట్టును రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో.. అంతేకాకుండా ఎలాంటి నూనేలను వినియోగిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ ట్రీ ఆయిల్ జుట్టుకు ఎందుకు ఉపయోగపడుతుంది?:
ప్రస్తుతం మార్కెట్‌లో టీ ట్రీ ఆయిల్‌ను మార్కెట్‌లో విచ్చల విడిగా విక్రయిస్తున్నారు. అయితే ఈ ఆయిల్‌ ప్రతి రోజూ జుట్టుకు వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జుట్టు రాలడం, వెంట్రుకలు తెల్లబడడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి జుట్టు సమస్యలున్నవారు దీనిని వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.


స్కాల్ప్:
టీ ట్రీ ఆయిల్‌లో జుట్టుకు కావాల్సిన యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ ఆయిల్‌ను జుట్టుకు అప్లై చేస్తే జుట్టులో పేరుకుపోయిన వ్యర్థాలు సులభంగా తోలగిపోతాయి. అంతేకాకుండా జుట్టు బలంగా ఒత్తుగా తయారవుతుంది. కాబట్టి జుట్టులోని ఫంగస్, బ్యాక్టీరియా వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఆయిల్‌ను వినియోగించాల్సి ఉంటుంది.


చుండ్రు నుంచి విముక్తి:
చుండ్రు స్కాల్ప్‌లో తీవ్రమైన దురదను కలిగిస్తుంది. అలాగే జుట్టు అందాన్ని కూడా పోగొడుతుంది. అయితే ఈ చుండ్రు సమస్యలతో బాధపడేవారు షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి సుమారు 5 నిమిషాలు అలాగే ఉంచండి.  ఇలా చేసిన తర్వాత శుభ్రమైన నీటితో స్నానం చేయాల్సి ఉంటుంది.


జుట్టు పెరుగుదల మెరుగ్గా ఉంటుంది:
ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల జుట్టు పెరగడంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి టీ ట్రీ ఆయిల్ వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి జుట్టు పెరుగుదలను మెరుగ్గా చేసేందుకు సహాయపడతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Payal Ghosh : ఎన్టీఆర్ గురించి అప్పుడు చెబితే అంతా నవ్వారు.. పాయల్ ట్వీట్ వైరల్.. చెర్రీ ఫ్యాన్స్ ఫైర్


Also Read : Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe