Health Tips For Board Exam Student: రేపటి నుంచి అంటే 2024 మార్చి 18 సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమవ్వనున్నాయి. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా ఇది అత్యంత స్ట్రెస్ ఇచ్చే సమయం. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వారి డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే వారు హెల్తీగా ఉండటమే కాదు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే వ్యక్తులు పగలు రాత్రి చదువుతూ వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టరు.  అయితే, కొన్ని టిప్స్‌ ఫాలో అయితే, విద్యార్థుల ఏకాగ్రత పెరగడంతోపాటు ఆరోగ్యంగా పరీక్షలకు హాజరుకాగలరు. ముఖ్యంగా వారి ఆరోగ్యం బాగుంటేనే పరీక్షలు బాగా రాస్తారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల డైట్‌ ప్లాన్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఎండకాలం వ్యాధుల బారిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలు ఏ ఇబ్బంది లేకుండా హాజరవుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీరు..
ఎండకాలం.. భానుడి భగభగలు మొదలయ్యాయి. మరోపక్క పదోతరగతి పరీక్షలు కూడా రానున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులు ఎక్కువశాతం నీరు తాగుతూ ఉండాలి. బాడీ డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువ శాతం లిక్విడ్ పదార్థాలు తీసుకోవడం మంచిది.


బ్రేక్‌ఫాస్ట్‌..
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బ్రేక్‌ఫాస్ట్‌ ఎట్టి పరిస్థితుల్లో దాటవేయకూడదు. రాత్రి దాదాపు 12 గంటల సమయం వరకు కడుపు ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ దాటవేయకూడదు.


ఆహారం..
పదో తరగతి హాజరయ్యే విద్యార్థులు పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరంగా చదువుతుంటారు. అయితే, వీరు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు, ఈ పరీక్షల సమయంలో హేవీగా తినకుండా జాగ్రత్తపడాలి. ఏది తీసుకున్నా చిన్న మొత్తంలో తీసుకోవాలి.  లేకపోతే కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు వస్తాయి.


ఇదీ చదవండి: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...


స్పైసీ ఫుడ్..
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పండ్లు, కూరగాయలు ఎక్కువగా చేర్చుకోవాలి. అంతేకాదు స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. దీంతో కడుపు మంట, అజీర్తి చేసే అవకాశం ఉంది. పరీక్షల సమయంలో ఇది ఇబ్బంది కలిగించే విషయం. ముఖ్యంగా వీరి ఆహారంలో నట్స్ వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. స్నాక్ సమయంలో వాల్‌నట్స్ వంటివి తీసుకోవడం మంచిది.


ఇదీ చదవండి: కంటోన్మెంట్ ఉపఎన్నిక బరిలో ఉంటా.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత..


ద్రవపదార్థాలు..
ఎండకాలం సమయం కూడా కావడంతో పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎక్కువ శాతం ద్రవ పదార్థాలు తీసుకునేలా జాగ్రత్తపడండి. వడదెబ్బ తగలకుండా కూడా జాగ్రత్తవహించండి. వీరి ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఆహారంలో లస్సీ, మజ్జిగ, చారు వంటివి తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook