Sugar Spike Control Tips: రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగకుండా నియంత్రణలో ఉంచడం ఎంతో మంచిది. ఇది ఆరోగ్య కరం కూడా అయితే చాలామందికి తిన్న వెంటనే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి. సాధనం కంటే తిన్న వెంటనే పెరుగుతుంది ఇది హైపర్ గ్లైసేమియాకు దారి తీస్తుంది. దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అయితే రక్తంలో చక్కెర స్థాయిలో ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఐదు విధాలుగా తిన్నా వెంటనే చేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరగవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్లైస మిక్స్..
డయాబెటిస్‌తో బాధపడేవారు ముఖ్యంగా తక్కువ గ్లైసమిక్ సూచి ఉన్న ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే షుగర్ లెవెల్స్ హఠాత్తుగా పెరిగిపోతాయి. ముఖ్యంగా తృణధాన్యాలు, బీన్స్, గంజి లేని ఆహార పదార్థాలు వంటివి తీసుకోవాలి.


పోర్షన్..
అంతే కాదు డయాబెటిస్‌తో బాధపడేవారు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉండే ఆహారాల జోలికి వెళ్లకూడదు.


ఫిజికల్ యాక్టివిటీ..
డయాబెటిస్ తో బాధపడేవారు తిన్న వెంటనే కూర్చోవడం పడుకోవడం వంటివి చేయకుండా కాసేపు వాకింగ్ చేయాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి తిన్నాక కనీసం 15 నిమిషాల వాకింగ్ అన్న చేస్తే బెట్టర్.


ఇదీ చదవండి: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..


ఫైబర్ ఫుడ్స్..
ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. ఫైబర్ అనేది కరిగే ఫైబర్ ముఖ్యంగా చియా సీడ్స్, కూరగాయలు మీన్స్ వంటివి డైట్లో చేర్చుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి.


ఇదీ చదవండి: కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతోందా? బామ్మల కాలం నాటి అద్భుత చిట్కా..


హైడ్రేషన్..
తక్కువ గ్లైసెమిక్‌ ఆహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండటం ఎంతో మంచిది. దీని వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అంతేకాదు వాతావరణంకు అనుగుణంగా నీళ్లు స్థాయిలు పెంచుకోవడం లేదు తగ్గడం చేసుకోవాలి.రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి తక్కువ మోతాదులో జీఐ ఉండే ఆహారాలు తీసుకోవడం, పోర్షన్ కంట్రోల్, నీళ్లు ఎక్కువగా తాగితే ఇలా జరుగకుండా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.