Sugarcane Juice Benefits in Summer: చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వర్షా, చలికాలంలో ఈ రసం తాగడం కంటే.. వేసవికాలంలో తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రసాన్ని ఎండాకాలంలో ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఇందులో ఉండే పోషక గుణాలు శరీరానికి అందుతాయి. అంతేకాకుండా ఎండా కారణంగా వచ్చే చర్మ, డిహైడ్రేషన్ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాళీ కడుపుతో ప్రతిరోజు ఈ చెరకు రసాన్ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
సమ్మర్ లో చాలామంది రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ అతిగా తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా చెరుకు రసం తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవి కారణంగా వచ్చే డీహైడ్రేషన్ సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు శక్తినిస్తుంది. కాబట్టి వేసవికాలంలో ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.


Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..


శరీరానికి పోషకాలు సమృద్ధిగా అందుతాయి:
చెరకు రసంలో శరీరానికి అవసరమైన విటమిన్లు (ఎ, బి-కాంప్లెక్స్, సి ), ఖనిజాలు (కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం), యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ప్రతిరోజు చెరకు రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జీర్ణ క్రియ సమస్యలకు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి.


జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగు పడుతుంది:
వేసవికాలంలో అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం కారణంగా చాలామందిలో తీవ్ర పొట్ట సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో చెరకు రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఈ రసంలో ఉండే పోషక గుణాలు మలబద్ధకం సమస్యలను సులభంగా దూరం చేస్తాయి. అంతేకాకుండా జీర్ణ క్రియను మెరుగుపరిచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook