Buttermilk Benefits: బటర్ మిల్క్‌తో బంపర్ బెనిఫిట్స్.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Buttermilk Benefits: బట్టర్ మిల్క్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగ ఎండా కాలంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎన్నో వ్యాధులకు చెక్ పెడుతుంది. బట్టర్ మిల్క్ తీసుకోవడం కలిగే ప్రయోజనాలంటే తెలుసుకుందాం.
Health benefits of drinking buttermilk: సూర్యభగవానుడు ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడు ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది వడదెబ్బకు గురికావడం, డీహైడ్రేషన్ బారినపడటం జరుగుతుంది. ఎండాకాలంలో మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మజ్జిగ హెల్తీగా ఉంచడమే కాదు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది కూడా. మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
మజ్జిగ ప్రయోజనాలు
** మజ్జిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఉబ్బరం మరియు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇంతేకాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది.
** ఇది చర్మ, జుట్టు సమస్యలను దూరం చేయడంలో మజ్జిగ ఉపయోగకరంగా ఉంటుంది.
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
** శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో మజ్జిగ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
** బట్టర్ మిల్క్ లో కాల్షియం మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యం ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుంది.
**మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్, గుండె డబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
** మజ్జిగలో కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో సూపర్ గా పనిచేస్తుంది.
** మజ్జిగలో పొటాషియం, సోడియం సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: Side Effects of Using More AC: ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నారా ? ఐతే మీకు ఈ జబ్బులు ఖాయమట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి