Best Cooking Oil: కూరగాయలు, చిప్స్, పకోడీ, ఫాస్ట్ ఫుడ్స్ నుండి మొదలుకొని.. నాన్ వెజ్ వరకు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినేది మన దేశంలోనే. ఆయిల్ ఫుడ్ వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ మరియు మధుమేహం వంటి వ్యాధుల బారినపడే అవకాశాలు ఉన్నాయి. నూనె పదార్ధాల వల్ల శరీరంలోని రక్తంలో లో డెన్సిటీ లిపోప్రొటీన్ యొక్క స్థాయి హై డెన్సిటీ లిపోప్రొటీన్ కన్నా ఎక్కువగా పెరుగుతుంది. ఇది పెద్ద ప్రమాదానికి సంకేతం.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాచురేటెడ్ ఫ్యాట్ వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. 
మార్కెట్ లో కొన్ని వంట నూనెలు తక్కువ ఫ్యాట్ కలిగి ఉండదని.. లేదా ఆరోగ్యకరమైన నూనె అని చెప్తుంటారు. కానీ వాటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీనికి కారణం ఆ నూనెల్లో ఉండే  శాచురేటెడ్ ఫ్యాట్.. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. కావున ఆరోగ్యంగా ఉండడానికి అన్ శాచురేటెడ్ నూనెలను ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల శరీరంలో లో డెన్సిటీ లిపోప్రొటీన్ ని తగ్గుతుంది. 


కొలెస్ట్రాల్ తగ్గించే వంట నూనెలు  
భారతదేశానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే అన్ శాచురేటెడ్ నూనెల గురించి తెలిపారు.  


Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ,, తెలంగాణకు భారీ వర్ష సూచన


1. ఆలివ్ ఆయిల్ 


2. సన్‌ఫ్లవర్ ఆయిల్ 


3. మొక్కజొన్న నూనె 


4. తెల్ల ఆవాల నూనె  


5. నట్స్ ఆయిల్ 


అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించే ఇతర విధానాలు  


- ఫైబర్ కలిగిన పదార్ధాలని ఎక్కువగా తినాలి.   


- జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.  


- రోజూ వ్యాయామం మరియు హెవీ వర్కవుట్ చేయాలి.  


- ఎక్కువగా బీటా గ్లూకాన్ కలిగిన ఆహారాలను తీసుకోవాలి.   


- ఆల్కహాల్ అలవాటును వెంటనే మానుకోవాలి.


Also Read: Samantha Pet Dog: నాగచైతన్య దగ్గర సమంత పెట్ డాగ్ ఉందేంటి? వాళ్లిద్దరూ కలిసిపోయారా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook