Superfoods: అతిగా తిని అయాసపడకుండా..కడుపులో అజీర్తి, ఉబ్బరం తగ్గించుకోవడానికి 5 సూపర్ ఫుడ్స్..
Superfoods For Bloating: వెబ్ఎండి నివేదిక ప్రకారం అరటిపండు లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కడుపు సమస్యలు ఉన్నవారు అరటిపండు తీసుకోవడం వల్ల అజీర్తి, ఉబ్బరం సమస్యలు త్వరగా తగ్గిపోయాయి. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Superfoods For Bloating: కొన్ని రకాల ఆహారాలు కడుపులో ఇబ్బందిని కలిగిస్తాయి. కడుపుబ్బరం అజీర్తి కలుగుతుంది గ్యాస్ కూడా సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యల నుంచి త్వరగా బయటకు రావాలంటే కొన్ని రకాల ఆహారాలు కడుపుబ్బరం అజీర్తి సమస్యను తగ్గిస్తాయి.
కడుపు ఉబ్బరం లక్షణాలు
కడుపు గట్టిగా అనిపించడం ఉబినట్టుగా లక్షణాలు కనిపిస్తాయి. కడుపులో నొప్పి ఒక్కొక్కసారి కడుపులో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి.
అరటిపండు..
అరటిపండు అన్ని సీజన్లలో దొరుకుతాయి. అరటిపండు లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కడుపు సమస్యలు ఉన్నవారు అరటిపండు తీసుకోవడం వల్ల అజీర్తి, ఉబ్బరం సమస్యలు త్వరగా తగ్గిపోయాయి. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా కడుపులో గ్యాస్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది.
అవకాడో..
అవకాడో అంటేనే సూపర్ ఫుడ్ ఎందుకంటే ఇందులో ఫైబర్ మన శరీరాన్ని ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పొటాషియం ఆరోగ్యానికి పని తీరుకు మేలు చేస్తుంది ఇందులో ప్రకటవ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి ఇది గ్యాస్ని తగ్గిస్తుంది.
ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..
పసుపు..
పసుపులో యాంటీ ఇన్ల్ఫమీటరి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన వంట గదిలో నిత్యం అందుబాటులో ఉంటుంది ఇది పసుపు రంగులో ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఉండే కడుపు సమస్యలను తగ్గిస్తుంది కడుపులో అజీర్తి, జీర్ణ సమస్యలు ఉంటే పసుపు నీటిని తాగాలి.
అస్పర్గస్..
వెబ్‌ఎండీ నివేదిక ప్రకారం మంచి ఇన్సులిన్ ఉంటుంది ముఖ్యంగా ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి దోహదం చేస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
టమాటలు
టమోటాలు కూడా కడుపు సమస్యలను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది ఇందులో ఉండే లైకోపీన్ యాంట్ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది టమాటాలు నిత్యం మనం వంటింట్లో అందుబాటులోనే ఉంటాయి ఇందులో ముఖ్యంగా పొటాషియం ఉంటుంది ఇది కడుపులో అజీర్తి సమస్యను తగ్గిస్తుంది మన శరీరంలో ఉన్న సోడియంని గ్రహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అందుకే కడుపు సమస్యలు ఉన్నప్పుడు టమాటాలను డైట్లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి