Symptoms Of High Cholesterol In Legs: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి వంద మందిలో ముప్పై మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలున్నా వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఇంట్లో లభించే పలు రకాల వస్తువులతో ఉపశమనం పొందవచ్చని నిపుణలు తెలుపుతున్నారు. ఈ సమస్యల ద్వారా చాలా మందిలో  గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల బారిన పడకుండా పలు రకాల ఆహార నియమాలు పాటిస్తే చాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను ఎలా గుర్తించాలి..?:
శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగినప్పుడు స్పష్టమైన లక్షణాలు ఎప్పుడూ కనిపించవు. అయితే కేవలం రక్త పరిక్ష చేయడం వల్ల పూర్తి కొలెస్ట్రాల్‌ పరిమాణాలను తెలుసుకోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణాలు అధికమైనప్పుడు కచ్చితంగా పలు రకాల మార్పులు శరీరంలో జరుగుతాయి. అయితే ఈ లక్షణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు ప్రధాన సంకేతాలని చెప్పొచ్చు. ముఖ్యంగా చాలా మంది ఈ సమస్యలతో ఉన్నవారికి తిమ్మిర్లు, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నివేదకలు తెలుపుతున్నాయి.


పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి అంటే ఏమిటి?:
శరీర భాగాలకు సరఫరా చేసే సిరల్లో కొలెస్ట్రాల్ భారీ పరిమాణంలో పెరుకుపోవడాన్నే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని అంటారు. అయితే దీని వల్ల పాదాలకు రక్త సరఫరాలు ఆగిపోయే అవకాశాలున్నాయి. కావున ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే డాక్టర్లను సంప్రదించడం చాలా మేలు.


అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు:
కాళ్ళకు, పదాలకు రక్త సరఫరాలో సమస్యలు తలెత్తినప్పుడు.. శరీరంలో పలు చోట్ల నొప్పులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో ఆక్సిజన్ మొత్తం క్రమంగా తగ్గే అవకాశాలున్నాయి. ఇలాంటప్పుడు తొడలు, కాళ్ళలో తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంది. దీని ప్రభావం చర్మం, గోర్లు మార్పలకు కారణం కావొచ్చు. ఇవీ పసుపు రంగులోకి మారవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కావున ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తీసుకునే ఆహారాల్లో పలు రకాల నియమాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read:  Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం


Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook