Eating Rusk Side Effects: చిన్నపిల్లలు, పెద్దలు రస్క్‌ను తినడానికి ఎంతో ఇష్టపడుతారు.  దీని వేడి వేడి టీతో పాటు తీసుకోవడానికి ఎంతో ఇష్టంగా తింటారు. దీని మార్కెట్‌లో కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే నిపుణులు ప్రకారం రస్క్‌ను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారని చెబుతున్నారు.  అయితే రస్క్‌ను తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావం:


రస్క్‌ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఇందులో  షుగర్‌ , గ్లూటెన్‌ రస్క్‌లలో కలుపుతారు. ఇది రుచికరంగా ఉండాలంటే ఈ రెండు పదార్థాలను కలుపుతారు. కానీ షుగర్‌, గ్లూటెన్‌ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు.  దీని తీసుకోవడం వల్ల జీవక్రియ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.


అనారోగ్యానికి దారి తీస్తుంది: 


రస్క్‌ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమవుతుంది. టీలో కలిపిన చక్కెరలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు టీలో కలిపిన చక్కెరలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. 


షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయి: 


రస్క్‌లో షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉంటాయి. టీలో చక్కెరను కలపడం వల్ల షుగర్‌ లెవెల్స్‌ పెరుగుదల ఇన్సులిన్‌ లెవెల్స్‌లను ప్రభావితం చేస్తుంది. రస్క్‌లను రోజూ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. రస్క్‌లో గ్లూటెన్ ఎక్కువగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరానికి జీర్ణం కావడం కష్టమవుతుంది.


రస్క్‌ వల్ల వాపులు, నొప్పి:


రస్క్‌ను కొంతమంది తీసుకోకుండా ఉండాలి. ముఖ్యంగా ఉదరకుహర వ్యాధితో బాధపడుతున్నవారు ఈ రస్క్‌లు తినడం మానుకోవాలి. దీని వల్ల వాపు, నొప్పి, విరేచనాలు కలుగుతాయి. అధిక కార్బోహైడ్రేట్ పాలు, టీతో రస్క్‌లను తినడం వల్ల  క్యాలరీల సంఖ్య పెరుగుతుంది.  


Also Read Refrigirator close to wall: మీరు ఫ్రిజ్‌ని గోడకు దగ్గరగా పెట్టారా? ఈ 3 ప్రమాదాలు తప్పవు జాగ్రత్త..


గ్యాస్ట్రిక్ సమస్యలు:


రస్క్‌లలో ఫైబర్‌ కంటెంట్‌ తక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీని వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలకు మరింత దారితీస్తుంది. దీని పిల్లలకు ఇవ్వడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter